Tomato: మధుమేహంతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అనారోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల డయాబెటిస్ వ్యాధి ఎక్కువగా ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తుంది. మధుమేహానికి చాలా కారణాలు ఉన్నాయి. కాబట్టి మధుమేహం ఉన్నవారు ఎలాంటి ఆహారం తీసుకునే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి.
షుగర్ ఉన్నవారు ఏమీ తినకూడదు. ఆహారం కూడా చాలా పరిమితంగా ఉండాలి. లేదంటే షుగర్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండాలి. దీని ప్రకారం మధుమేహంతో బాధపడేవారు టమోటాలు ఎక్కువగా తినకూడదని చెబుతారు. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు టమోటాలు తినవచ్చా? లేదా? దీని గురించి ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం. 100 గ్రాముల టమాటాల్లో ఏయే పోషకాలు ఉంటాయంటే.. సుమారు 22 కేలరీలు, 4.8 గ్రా కార్బోహైడ్రేట్లు, 3.2 గ్రా చక్కెర, 1.1 గ్రా ప్రోటీన్, 0.2 గ్రా కొవ్వు, 1.5 గ్రా ఫైబర్ ఉంటుంది.
ఇది కూడా చదవండి: Lemon Water: లెమన్ వాటర్ ఎక్కువగా తాగితే వెంటనే ఆపేయండి..!
మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎటువంటి సందేహం లేకుండా టమోటాలను తినవచ్చు. టొమాటో తీసుకోవడం ఇన్సులిన్ స్థాయిలను నిర్వహించడానికి సహాయపడుతుంది. వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. టొమాటో మధుమేహానికి అనుకూలమైన కూరగాయ అని చెబుతారు. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎలాంటి భయం లేకుండా టమోటాలను తినవచ్చు. టమోటాలు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.