Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో సినీ నటుడు అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై నాంపల్లి కోర్టు శుక్రవారం తీర్పు ఇవ్వనున్నది. ఇప్పటికే బెయిల్ పిటిషన్‌పై ఇరువాదనలు పూర్తయ్యాయి. ప్రస్తుతం హైకోర్టు మధ్యంతర బెయిల్‌పై అల్లు అర్జున్ బయట ఉన్నారు. ఈ రోజు బెయిల్ పిటిషన్‌పై వెలువడే తీర్పుపై అంతటా ఆసక్తి నెలకొన్నది. అల్లు అర్జున్ అభిమానులు మాత్రం బెయిల్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాఠ ఘటనలో ఏ11 నిందితుడిగా అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేశారు. నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టగా, 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ మేరకు అల్లు అర్జున్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ లోగా సాయంత్రం హైకోర్టులో అల్లు అర్జున్ తరఫున వేసిన పిటిషన్‌పై మధ్యంతర బెయిల్ మంజూరైంది.
Allu Arjun: అయితే నడుమ బెయిల్ మంజూరు పత్రాలు సకాలంలో చంచల్‌గూడ జైలు అధికారులకు అందకపోవడంతో ఆ రోజు సాయంత్రం అల్లు అర్జున్ విడుదల కాలేదు. మరునాడు తెల్లవారు జామున ఆయనను జైలు నుంచి విడుదల చేశారు. అంటే ఒకరోజు జైలులోనే గడపాల్సి వచ్చింది. ప్రస్తుతం అల్లు అర్జున్ నాలుగు వారాల మధ్యంతర బెయిల్‌పై ఉన్నారు. ఈ రోజు నాంపల్లి కోర్టులో రెగ్యులర్ బెయిల్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొన్ని ఉన్నది.