Allu Arjun-Neel: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరో సంచలన ప్రాజెక్ట్‌తో అభిమానులను అలరించడానికి సిద్ధమయ్యారు. బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో ఆయన కొత్త చిత్రం ‘రావణం’ కన్ఫర్మ్ అయింది. ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు స్వయంగా ప్రకటించారు. ఈ సినిమా అల్లు అర్జున్ యాక్షన్‌తో పాటు డీప్ డ్రామా, ఎమోషనల్ ఎలిమెంట్స్‌తో హై-ఓక్టేన్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకోనుందని సమాచారం. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ చిత్రం, భారీ అంచనాలతో 1000 కోట్ల కలెక్షన్స్ టార్గెట్‌గా ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో ఓ సై-ఫై చిత్రంలో నటిస్తుండగా, ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్‌తో ‘డ్రాగన్’ చిత్రాన్ని పూర్తి చేస్తున్నారు. ఈ ఇద్దరి కాంబోలో ‘రావణం’ తెలుగు సినిమా ఖ్యాతిని మరో స్థాయికి తీసుకెళ్లనుందని అభిమానులు ఆశిస్తున్నారు.
#Ravanam with #PrashanthNeel & #AlluArjun will surely happen in our banner but takes time as they are pre occupied with multiple projects.
– #DilRaju during #Thammudu promotions pic.twitter.com/96Ux9J3KXC
— Cinema Mania (@ursniresh) July 2, 2025