Dhanush Divorce

Dhanush Divorce: విడిపోవడానికే నిర్ణయించుకున్న ధనుష్, ఐశ్వర్య

Dhanush Divorce: తమిళ స్టార్ హీరో ధనుష్, సౌతిండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య వివాహం 2004 నవంబర్ 18న అయ్యింది. అంటే ఇప్పటికి ఇరవై యేళ్ళు గడిచిపోయింది. అయితే రెండేళ్ళ క్రితం తాను, ఐశ్వర్య విడిపోవాలనుకుంటున్నామని ధనుష్ ప్రకటించారు. ఆ తర్వాత చెన్నయ్ లోని ఫ్యామిలీ కోర్టుకు వెళ్ళారు. గత కొన్ని నెలలుగా వీరు విచారణకు హాజరు కాకపోవడంతో తిరిగి కలిసి ఉండాలనే నిర్ణయానికి వీరు వచ్చారనే వార్తలు వినిపించాయి. అయితే అందులో వాస్తవం లేదని గురువారం తేలిపోయింది. తాజాగా విచారణకు హాజరైన వీరిద్దరూ తమకు కలిసి ఉండాలని లేదని, విడిపోవాలనే నిర్ణయించుకున్నామని తేల్చి చెప్పేశారు. దాంతో కోర్టు ఈ కేసు తుది తీర్పును ఇదే నెల  27కి వాయిదా వేసింది. మొత్తానికి తమిళనాడులో విడాకుల ప్రహసనం ఇలా కొనసాగుతూనే ఉంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *