Robotic Mules: ఇప్పుడు దేశ సరిహద్దుల్లో సైనికులతో పాటు రోబోటిక్ మల్టీ యుటిలిటీ లెగ్డ్ ఎక్విప్‌మెంట్ అంటే రోబోటిక్ డాగ్‌లను కూడా మోహరించనున్నారు. ఈ రోబోటిక్ కుక్కలు ఎత్తైన పర్వతాలు.. లోతైన నీటిలో ఎక్కడైనా పనిచేస్తాయి. 10 కిలోమీటర్ల దూరంలో కూర్చొని కూడా వీటిని ఆపరేట్ చేయవచ్చు. వీటిని ఒక గంట పాటు ఛార్జింగ్ చేస్తే, అవి 10 గంటల పాటు ఆగకుండా పనిచేస్తాయి. ఈ రోబోటిక్ డాగ్ జైసల్మేర్‌లోని పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్‌లో నవంబర్ 14 నుండి 21 వరకు ఇండియన్ ఆర్మీకి చెందిన బాటిల్ యాక్స్ డివిజన్‌తో ప్రాక్టీస్ చేసింది.
ఇది కూడా చదవండి: Fake Doctors: గుజరాత్ లో సంచలనం సృష్టిస్తున్న శంకర్ దాదా ఎంబీబీఎస్ డాక్టర్లు..
Robotic Mules: శత్రువును కనిపెట్టి నాశనం చేసేందుకు ఆర్మీ ఈ డాగ్స్ తో ప్రాక్టీస్ చేసింది. అంతేకాకుండా ఎత్తైన ప్రాంతాలలో సహాయం, వస్తువుల ట్రాన్స్ పోర్ట్ లో మరింత వేగం కోసం లాజిస్టిక్స్ డ్రోన్‌లను పరీక్షిస్తున్నారు. ఇటీవల భారత సైన్యం సరిహద్దు ప్రాంతాల్లో ముఖ్యంగా ఎత్తైన ప్రాంతాలలో 100 రోబోటిక్ కుక్కలను ప్రవేశపెట్టింది.
థర్మల్ కెమెరాలు,రాడార్‌తో ఈ రోబోటిక్ కుక్కలు ఉంటాయి. దీని అతిపెద్ద ఫీచర్ దాని డిజైన్. ఇది మంచు, ఎడారి, కఠినమైన నేల, ఎత్తైన మెట్లు, కొండ ప్రాంతాలు వంటి ప్రతి అడ్డంకిని దాటడానికి వీలు కల్పిస్తుంది. రోబోటిక్ డాగ్ శత్రువుల లక్ష్యాలను కాల్చగల సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటుంది. సైనికులకు ఎటువంటి హాని జరగకుండా కాపాడుతుంది.