Pushpa 2

Pushpa 2: పుష్ప 2పై కంప్లైంట్.. మా మనోభావాలు దెబ్బతిన్నాయంటూ..

Pushpa 2: దక్షిణ భారత చిత్రం పుష్ప-2పై హర్యానాలోని హిసార్ జిల్లాలోని ఓ గ్రామంలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. మతపరమైన మనోభావాలను దెబ్బతీశారని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై పోలీసులు ఇంకా ఎలాంటి కేసు నమోదు చేయలేదు.

ఈ కేసు దర్యాప్తు అధికారి గౌతమ్‌కుమార్‌ మాట్లాడుతూ.. ఇప్పుడే ఫిర్యాదు అందిందని చెప్పారు. ఉన్నతాధికారులతో చర్చించిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. హిసార్‌లోని జుగ్లాన్‌లో నివాసం ఉంటున్న కులదీప్ కుమార్ ఈ ఫిర్యాదు చేశారు. డబ్బు కోసం ఉద్దేశపూర్వకంగా ఒక నిర్దిష్ట మతాన్ని అవమానించే ప్రయత్నం జరుగుతోందని కుల్దీప్ అన్నారు. సినిమా ఇలాగే కొనసాగితే హిసార్ (హర్యానా)లో విడుదలకు అనుమతించబోమని కుల్దీప్ అన్నారు.

ఇది కూడా చదవండి: Dhanush Divorce: విడిపోవడానికే నిర్ణయించుకున్న ధనుష్, ఐశ్వర్య

ఫిర్యాదు ఇదీ.. 

Pushpa 2: నవంబర్ 17 ఆదివారం పాట్నాలోని గాంధీ మైదాన్‌లో పుష్ప 2 ది రూల్ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రం డిసెంబర్ 5న విడుదల కానుంది.  ఈ కార్యక్రమానికి నటులు అల్లు అర్జున్, రష్మిక మందన్న కూడా హాజరయ్యారు. మా కాళి లాంటి చిత్రాన్ని ట్రైల‌ర్‌లో చూపించ‌డం చూశాను.

నటుడు అల్లు అర్జున్ అర్ధనారీశ్వర్ అవతారంలో కనిపించారు.  దీని కారణంగా సనాతన ధర్మంతో సంబంధం ఉన్న వ్యక్తులు, నేను నా మాత విశ్వాసాలు దెబ్బ తీసినట్టుగా భావిస్తున్నాం. సినిమాతో పాటు ఆర్టిస్టులందరినీ గౌరవిస్తాను కానీ, డబ్బు కోసం కొందరు ఆర్టిస్టులు ఫలానా మత విశ్వాసాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ సీన్‌ను సినిమా నుంచి తొలగించకపోతే హర్యానాలోని హిసార్‌లో ‘పుష్ప 2 ది రూల్’ విడుదలకు అనుమతి ఉండదు. నటుడు అల్లు అర్జున్ ఇమెయిల్ ఐడి, శాశ్వత చిరునామా ఫిర్యాదులో ఇచ్చారు.  దర్శకుడు, ఆర్టిస్టులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కుల్దీప్ పోలీసు యంత్రాంగం నుండి డిమాండ్ చేశాడు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Sai Pallavi: ‘ఆకాశంలో ఒక తార’లో సాయిపల్లవి డౌటే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *