సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ తమిళ హీరో విజయ్‌తో సినిమా నిర్మించేందుకు విపరీతంగా ప్రయత్నిస్తున్నారంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. ఆ విషయంలో ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై ఎన్ని రాసినా ఇన్నాళ్లూ సైలెంట్‌గా ఉన్నా. కానీ ఇప్పుడు స్పష్టం చేస్తున్నా. తాను ఏ పెద్ద హీరోతోనూ కలసి పనిచేయాలన్న ఆరాటంతో లేనని స్పష్టం చేశారు. తన పేరును వాడటం మానండంటూ చెప్పారు. అంతేకాకుండా తనపై వదంతులు వ్యాప్తి చేస్తున్నవారు తనకు క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ హెచ్చరించారు.
అన్నింటికంటే ముందుకు తనకు ఆత్మ గౌరవం ఉందని.. అదే ముఖ్యమని చెప్పుకొచ్చింది సిమ్రాన్. ఈ మేరకు తన ఇన్ స్టా ఖాతాలో ఆమె వేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుంది. ఒకప్పుడు తెలుగు, తమిళం, మలయాళం భాషలలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన సిమ్రాన్… పెళ్లయ్యాక సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు మళ్లీ రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారని.. సిమ్రాన్ నిర్మాణ రంగలోకి అడుగుపెట్టాలని అనుకుంటుందని.. ఇందుకోసం విజయ్ తో భారీ బడ్జెట్ మూవీ ప్లాన్ చేసిందంటూ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈ క్రమంలో సిమ్రాన్ చాలా ఘూటుగా స్పందించారు. ఇక అటు విజయ్ కూడా సినిమాలకు గుడ్ బై చెప్పేశారు. ఇకపై తన పూర్తి టైమ్ అంతా రాజకీయాల కోసమే పెడతానని స్పష్టం చేశారాయన.