Hair Fall: ఈ రోజుల్లో జుట్టు రాలడం అనేది సర్వసాధారణంగా మారింది. యువతీ, యువకుల నుంచి వృద్ధుల వరకు అన్ని వయసుల వారు ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఇది పెద్ద విషయంగా అనిపించకపోయినా.. మానసిక ఒత్తిడిని కూడా కలిగిస్తుంది. సాధారణంగా జుట్టు రాలడానికి చాలా కారణాలు ఉంటాయి. వాటిలో ఒకటి ఇల్లు మారడం. ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి మారినప్పుడు నీరు మారుతుంది. కాబట్టి మనం నివసించే చోట, తలస్నానానికి ఉపయోగించే నీరు కూడా జుట్టు రాలడానికి ప్రధాన కారణం కావచ్చు. నిజంగానే నీరు మారడం వల్ల హెయిర్ లాస్ అవుతుందా అనేది తెలుసుకుందాం..
నీటిని మార్చడం వల్ల జుట్టు రాలిపోతుందా?
నీటి మార్పు వల్ల జట్టు నాణ్యత దెబ్బతింటుందని ఆరోగ్య నిపుణులు తెలిపారు. నీటిలో ఎక్కువ క్లోరిన్, కాల్షియం, మెగ్నీషియం లేదా మురికి వంటి గట్టి లోహం ఉంటే అది జుట్టు, తలకు హాని కలిగిస్తుంది. అలాంటి నీళ్లతో జుట్టును కడుక్కుంటే తలలోని తేమ పోయి జుట్టు పొడిబారుతుంది. ఇది జుట్టు బలహీనంగా అవడానికి కారణమవుతుంది. అలాగే జుట్టులోని సహజ తేమను కూడా తొలగిస్తుంది. దీనిని నివారించడానికి ఈ కింది చిట్కాలను పాటించాలి.
ఇది కూడా చదవండి: China New Virus: చైనాలో కొత్త వైరస్ కలకలం
చిట్కాలు :
నీటిని శుద్ధి చేయడానికి ఫిల్టర్ ఉపయోగిచాలి. ఇది నీటి నాణ్యతను మెరుగుపరిచి జుట్టుకు హాని కలిగించదు.
జుట్టు తేమను నిర్వహించడానికి మాయిశ్చరైజర్లతో పాటు షాంపూలు, కండీషనర్లను ఉపయోగించాలి. ఇది జుట్టు పొడిబారకుండా చేస్తుంది.
వారానికి ఒకసారి కొబ్బరి, ఉసిరి లేదా బాదం నూనెతో తలకు మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల వెంట్రుకల మూలాలు దృఢంగా ఉండి తలలో తేమ నిలిచిపోతుంది.
జుట్టు ఆరోగ్యం కోసం, మీ ఆహారంలో ప్రోటీన్, విటమిన్లు, మినరల్ రిచ్ ఫుడ్స్ ను చేర్చుకుంటే మంచిది.
ఇలా చేసిన సమస్య అలాగే ఉంటే స్కిన్ స్పెషలిస్ట్ ను సంప్రదించాలి.