Accident: రాజేంద్రనగర్ ఔటర్ రింగ్ రోడ్ పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది . హిమాయత్ సాగర్ ఔటర్ రింగు రోడ్డు పై ఢీ వైడర్ ను ఢీ కొట్టిన కారు. డీ వైడర్ ను ఢీ కొట్టడంతో కారు డోరు ఓపెన్ అయిపోయి ఔటర్ రింగ్ రోడ్ పై నుండి కింద పడ్డ డ్రైవర్. స్పాట్ లోనే డ్రైవర్ ప్రాణాలు పోయాయి . సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు . రోడ్డుపై నుంచి పక్కనే ఉన్న చెట్ల పొదల్లో పడిపోయి ఉన్న మృత దేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించిన పోలీసులు . మృతుదీని నిలయ రెడ్డి గా గుర్తించారు . ఈయన L V ప్రసాద్ ఐ ఆసుపత్రి లో డాక్టర్ గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది . మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది .
