AAA 1st Convention: అమెరికాలో తెలుగు ప్రజల సంస్కృతీ బంధాన్ని మరింత గాఢంగా చేస్తున్న ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (AAA) తన మొదటి జాతీయ సదస్సు అంటే నేషనల్ కన్వెన్షన్ జరుపుకోవడానికి సిద్ధం అయింది. అమెరికాలో ఉంటున్న తెలుగు ప్రజలకు మన సంప్రదాయ మూలలను చెదిరిపోని బంధంగా నిలిచేలా చేయడమే ధ్యేయంగా AAA పనిచేస్తోంది. ఇంటికి దూరంగా ఎక్కడో సప్త సముద్రాల అవతల వివిధ కారణాలతో జీవిస్తున్న తెలుగు ప్రజలను మన పండుగలు.. వేడుకలు.. సంప్రదాయాల దారాలతో ఒక్క చోటికి చేరుస్తూ వస్తోంది AAA. ఇప్పుడు AAA మొదటి మహా సభలను నిర్వహించడానికి సమాయత్తం అవుతోంది. ఈ సందర్భంగా AAA మన సంప్రదాయాలలోని గొప్పతనాన్ని అందరూ మనస్సులో నింపుకునేలా కొన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసింది.
AAA మొదటి నేషనల్ కన్వెన్షన్ మార్చి 28, 29 తేదీల్లో ఫిలడెల్ఫియా ఎక్స్ పో సెంటర్ లో వేడుకగా నిర్వహించనున్నారు. ఈ వేడుక కోసం ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ప్రముఖ సినీ సంగీత దర్శకుడు తమన్ ఆధ్వర్యంలో అతి పెద్ద మ్యూజికల్ కాన్సర్ట్ ఈ సందర్భంగా అందరినీ అలరించడానికి సిద్ధం అవుతోంది. ప్రముఖ గాయనీ గాయకులు ఇందులో పాల్గొంటారు. ఇక కార్యక్రమంలో ప్రముఖ సినీ నటులు ప్రత్యేకంగా హాజరై సందడి చేయనున్నారు. నటులు శ్రీకాంత్ , నిఖిల్ , సందీప్ కిషన్ , ఆది , తరుణ్ , సుశాంత్, విరాజ్ అశ్విన్ వేడుకలో పాల్గొనబోతున్నారు .
అంతేకాదు నటీమణులు ఐశ్వర్య రాజేష్ , మెహరీన్ , ఆంకితకుమార్ , రుహానీ శర్మ , అమృతా అయ్యర్ , దక్షా నాగార్కర్ , కాయల్ ఆనంది , నువేక్ష , చంద్రికా రవి కార్యక్రమంలో మెరవబోతున్నారు.
సినీ నటులే కాదు . . ప్రముఖ తెలుగు రాజకీయనేతలు AAA మొదటి నేషనల్ కన్వెన్షన్ కు హాజరు కానున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘు రామ కృష్ణంరాజు, ఏపీ హోమ్ మినిష్టర్ వంగలపూడి అనిత, హెల్త్ మినిష్టర్ సత్యకుమార్ యాదవ్ , అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్, చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, వినుకొండ ఎమ్మెల్యే జీవీఎస్ ఆంజనేయులు, ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్, ఉదయగిరి ఎమ్మెల్యే సురేష్ కాకర్ల AAA మొదటి మహాసభలో ప్రత్యేకంగా పాల్గొనబోతున్నారు.
అమెరికాలోని తెలుగు ప్రజలు అందరూ ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు. పూర్తి వివరాల కోసం ప్రదీప్ బాలాజీ . . ఫోన్ నెంబర్ : +1 (603) 402-5374 అదేవిధంగా రవి చిక్కాల +1 (484) 280-4610 లను సంప్రదించవచ్చు .