Ghaati : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి లేటెస్ట్ మూవీ ‘ఘాటి’ సినీ ప్రియుల్లో భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. ప్రముఖ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి రూపొందిస్తున్న ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్‌తో అంచనాలను ఆకాశానికి తాకేలా చేసింది. ఇప్పుడు మేకర్స్ సినిమా రిలీజ్ డేట్‌ను కూడా లాక్ చేశారు. జూలై 11న ‘ఘాటి’ థియేటర్లలో సందడి చేయనుంది. ప్రమోషన్స్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లేందుకు చిత్ర బృందం జోరుగా ప్లాన్ చేస్తోంది.
Also Read: Andala Rakshasi: అందాల రాక్షసి రీరిలీజ్!
Ghaati : అయితే, అనుష్క తన సెంటిమెంట్‌ను బ్రేక్ చేస్తుందా? గతంలో ఆమె సినిమా ప్రమోషన్స్‌కు దూరంగా ఉండి, కేవలం ఒకటి రెండు ఇంటర్వ్యూలకు మాత్రమే అందుబాటులో ఉండేది. కానీ, ‘ఘాటి’ అనుష్కతో పాటు క్రిష్‌కు కూడా కీలకమైన ప్రాజెక్ట్. ఈ సినిమాను ప్రేక్షకుల్లోకి గట్టిగా తీసుకెళ్లేందుకు అనుష్క యాక్టివ్‌గా ప్రమోషన్స్‌లో పాల్గొంటుందా? ఈ జేజమ్మ ఏం చేయబోతుందో చూడాలి!