Kamareddy: ఈ నెల 15న కామారెడ్డిలో జరగాల్సిన కాంగ్రెస్ బీసీ మహా గర్జన సభ వాయిదా పడింది. భారీ వర్షాల కారణంగా సభను ముందస్తుగా నిర్ణయించిన తేదీలో నిర్వహించడం సాధ్యం కానందున వాయిదా వేసినట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు. కొత్త తేదీని త్వరలో ప్రకటించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.