US

US: అమెరికాలో దారుణ ఘటన: భారత సంతతి వ్యక్తి దారుణ హత్య

US: అమెరికాలోని డల్లాస్ నగరంలో భారత సంతతికి చెందిన వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. ఒక మోటెల్ మేనేజర్‌గా పనిచేస్తున్న 50 ఏళ్ల చంద్రమౌళి నాగమల్లయ్యను ఆయన సహోద్యోగి అత్యంత క్రూరంగా హత్య చేశారు. బుధవారం, మోటెల్‌లోని ఒక గదిని శుభ్రం చేస్తున్న మార్టినెజ్ అనే ఉద్యోగితో నాగమల్లయ్యకు వాగ్వాదం జరిగింది. పాడైపోయిన వాషింగ్ మెషీన్‌ను ఉపయోగించవద్దని నాగమల్లయ్య మార్టినెజ్‌కు నేరుగా చెప్పకుండా, మరొక మహిళా ఉద్యోగి ద్వారా చెప్పించడంతో మార్టినెజ్‌ ఆగ్రహానికి గురయ్యాడు.

 

ఈ చిన్న వివాదం చిలికిచిలికి గాలివానలా మారి, మార్టినెజ్‌ ఆవేశంతో నాగమల్లయ్యపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిని ఆపడానికి బాధితుడి కుటుంబసభ్యులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. నాగమల్లయ్య అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించగా, మార్టినెజ్‌ వెంబడించి, ఆయన తలను నరికి చెత్తకుప్పలో పడేశాడు.

Also Read: Nepal Protest: ఫలించిన లోకేష్ కృషి. మనవాళ్లు వచ్చేశారు

ఈ దారుణ ఘటన సెప్టెంబర్ 10న డల్లాస్‌లోని ‘డౌన్‌టౌన్ సూట్స్ మోటెల్’లో జరిగింది. పోలీసులు మార్టినెజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్యపై భారత కాన్సులేట్ స్పందిస్తూ, నాగమల్లయ్య మృతి తమను దిగ్భ్రాంతికి గురిచేసిందని తెలిపింది. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని, అవసరమైన సహాయం చేస్తామని కాన్సులేట్ పేర్కొంది.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  KTR: రేవంత్‌ రెడ్డి మోసపూరిత నేత... ప్రజలు భయంకరంగా మోసపోయారు: కేటీఆర్ ఆగ్రహం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *