Skincare Tips: చాలా మంది మొటిమలతో మస్త్ ఇబ్బంది పడతారు. ముఖం మీద చర్మం చాలా జిడ్డుగా ఉంటే మొటిమలు ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటది. చెమట, ధూళి ముఖానికి అంటుకున్నప్పుడు..అవి చర్మంలోని చిన్న రంధ్రాలలో చిక్కుకుని బొబ్బలు ఏర్పడే అవకాశం ఉంది. ఇలా జరిగినప్పుడు చాలా మంది మార్కెట్లో లభించే ఉత్పత్తులను ఉపయోగిస్తారు. కానీ వాటి బదులు బొప్పాయి విత్తానలతో మొటిమలకు చెక్ పెట్టవచ్చు. అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం..
బొప్పాయి గింజల పేస్ట్ :
బొప్పాయి గింజలు మొటిమల సమస్యలను వదిలించుకోవడానికి సహాయపడతాయి. కాబట్టి బొప్పాయి గింజలను గ్రైండ్ చేసి పేస్ట్ లా చేసి మొటిమల ఉన్న చోట రాయాలి. 15-20 నిమిషాలు అలాగే ఉంచి.. గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ఇలా చేయడం ద్వారా ఈ విత్తనాలలోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు మంట, ఇన్ఫెక్షన్‌ను తగ్గిస్తాయి. మొటిమల సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తాయి.
బొప్పాయి గింజలు – తేనె ఫేస్ ప్యాక్:
బొప్పాయి గింజలను పేస్ట్ లా చేసి దానికి తేనె కలపాలి. ఈ మిశ్రమంతో ముఖాన్ని సున్నితంగా మసాజ్ చేయాలి. ఈ తేనె చర్మాన్ని తేమగా ఉంచుతుంది. బొప్పాయి గింజలు చర్మాన్ని బిగుతుగా చేయడానికి సహాయపడతాయి. ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి.
Also Read: Head Bath: ఈ రోజున స్త్రీలు తల స్నానం చేయకూడదు!
Skincare Tips: బొప్పాయి గింజల స్క్రబ్:
బొప్పాయి గింజలను రుబ్బి దానికి కొద్దిగా నీరు లేదా తేనె కలిపి స్క్రబ్ లా చేయాలి. దీనితో ముఖాన్ని సున్నితంగా మసాజ్ చేయండి. ఇది మొటిమలను తొలగిస్తుంది. ఇది చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో సహాయపడటమే కాకుండా మృదువుగా, ప్రకాశవంతంగా చేస్తుంది.
బొప్పాయి గింజలు – పాల ఫేస్ ప్యాక్:
ముందుగా బొప్పాయి గింజలను పేస్ట్ లా తయారు చేసుకోండి. దీనికి కొంచెం పాలు కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. కొంత సమయం తర్వాత ముఖాన్ని గోరువెచ్చని నీటితో కడగాలి. ఈ ప్యాక్ చర్మానికి లోతైన పోషణను అందించి మృదువుగా చేస్తుంది. వృద్ధాప్యాన్ని నివారించి ముఖ కాంతిని పెంచుతుంది.
గమనిక: ఇక్కడ ఇచ్చిన ఆర్టికల్ ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఇచ్చింది. సంబంధిత విషయాలపై ఆసక్తి ఉన్న పాఠకుల కోసం అందించడం జరిగింది. ఈ ఆర్టికల్ లోని అంశాలను ఫాలో అయ్యే ముందు మీ ఫ్యామిలీ డాక్టర్ ను సంప్రదించాల్సిందిగా మహా న్యూస్ సూచిస్తోంది.