Japan

Japan: ప్రధాని పదవికి రాజీనామా చేయనున్న ఇషిబా!

Japan: జపాన్ ప్రధాన మంత్రి షిగేరు ఇషిబా, ఇటీవల జరిగిన ఎన్నికలలో పార్టీ ఓటమి నేపథ్యంలో, పార్టీలో అంతర్గత విభేదాలు రాకుండా ఉండేందుకు తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు జపాన్ ప్రభుత్వ రంగ టీవీ ఎన్‌హెచ్‌కే వెల్లడించింది. జూలైలో జరిగిన పార్లమెంటు ఎగువ సభ ఎన్నికల్లో అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (LDP) మెజారిటీ కోల్పోయింది. దీంతో ఇషిబాపై రాజీనామా ఒత్తిడి పెరిగింది.

ఇది కూడా చదవండి: Naresh 65th film: నరేష్ 65: లాఫ్టర్‌తో కూడిన మిథలాజికల్ ఎంటర్‌టైనర్!

అయితే, దేశానికి ముఖ్యమైన సమస్యలు ఉన్నాయని, రాజీనామా చేసే ఉద్దేశం లేదని గతంలో ఆయన తెలిపారు. కానీ, పార్టీలో పెరుగుతున్న విభేదాలను అరికట్టడానికి ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఇషిబా కెరీర్‌ ఆరంభంలో బ్యాంకింగ్‌ రంగంలో పనిచేశారు. తన 29 ఏళ్ల వయసులో 1986లో తొలిసారిగా పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. ప్రభుత్వ విధానాలను బహిరంగంగా వ్యతిరేకిస్తూ తరచూ వార్తల్లో నిలిచేవారు. ఈ క్రమంలో కిషిద ప్రభుత్వంలో ఆయనను పక్కనబెట్టారు. గత ఎల్‌డీపీ ప్రభుత్వంలో రక్షణశాఖ మంత్రిగా పనిచేశారు. పార్టీ అధ్యక్ష పదవికి ఆయన ఐదు సార్లు పోటీపడ్డారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Ajith Kumar: మళ్ళీ రేసర్ గా అజిత్..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *