SSMB29: మహేష్ బాబు, ప్రియాంక చోప్రా జోనస్ జంటగా రాజమౌళి రూపొందిస్తున్న ‘ఎస్ఎస్ఎంబీ29’ సినిమా షూటింగ్ దక్షిణాఫ్రికాలో జోరందుకుంది. ఈ భారీ బడ్జెట్ జంగిల్ అడ్వెంచర్ చిత్రంలో మహేష్ ఒక రగ్డ్ ఎక్స్‌ప్లోరర్‌గా కనిపించనున్నారు. సెప్టెంబర్ 2025లో మొదలైన ఈ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా ఇండియన్ సినిమాలో అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్‌లలో ఒకటిగా నిలుస్తుంది, దాదాపు 1000 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ప్రియాంక చోప్రా ఈ చిత్రంతో భారతీయ సినిమాకు రీ-ఎట్రీ ఇస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్, ఆర్ మాధవన్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా 2027లో విడుదలయ్యే అవకాశం ఉంది. వచ్చే నవంబర్లో ఫస్ట్ లుక్ విడుదల కానుంది.
