Pawan Effect in Pithapuram

Pawan Effect in Pithapuram: మంచి చేస్తున్నా మాట పడాల్సి వస్తోందా..!!??

Pawan Effect in Pithapuram: దేవాళయాల సన్నిధి, ఆధ్యాత్మిక వేదిక పిఠాపురం. అమ్మవారి శక్తి పీఠం, పాదగయ, ఇంకా ఎన్నో ఆలయాలకు నెలవు పిఠాపురం. అటువంటి నేలపై పుట్టడమే అదృష్టంగా భావిస్తుంటారు అక్కడ చాలా మంది ప్రజలు. అటువంటి చోట మానవత్వం కలిగిన మనిషిగా ఎంటరయ్యారు పవన్‌ కళ్యాణ్‌. సనాతన ధర్మంపై విశ్వాసం పెంచుకున్న పవన్‌కళ్యాణ్‌.. మానవతా వాదిగా నిలుస్తున్నారు. గత ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేయాలా అన్న సందిగ్ధంలో చివరి నిమిషంలో పిఠాపురంని ఎంచుకున్న పవన్‌.. దేశంలోనే మోడల్‌ నియోజకవర్గంగా చేయాలని ఆ నాడే నిర్ణయించుకున్నారు. అదే విధంగా పిఠాపురంను టెంపుల్‌ సిటీగా చేస్తానని హామీ ఇచ్చారు. పిఠాపురంలో ఉండేది తక్కువే అయినా, నిత్యం ఏదో ఒక కార్యక్రమంతో పవన్‌ తమతోనే ఉన్నారన్న భావన అక్కడి ప్రజల్లో కలిగిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యేగా, డిప్యూటీ సీఎంగా ఒక్క ఏడాది కాలంలోనే 300 కోట్ల రూపాయల కన్నా ఎక్కువ విలువైన అభివృద్ధి పనులను పిఠాపురంలో చేపట్టారు. 30 బెడ్ల కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ని 100 బెడ్ల ఏరియా హాస్పిటల్‌గా అప్‌గ్రేడ్ చేశారు. ఇందుకు 34 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. పిఠాపురం ప్రభుత్వ హాస్పిటల్‌లో కొత్త ఎక్స్-రే యూనిట్ ఏర్పాటు చేశారు. పిఠాపురం మున్సిపాలిటీకి 3 కోట్ల రూపాయలు, గొల్లప్రోలు నగర పంచాయతీకి ఒక కోటి రూపాయలు కేటాయించారు.
గొల్లప్రోలులో తాగునీటి సౌకర్యం కోసం 72 లక్షల రూపాయలతో పైప్‌లైన్‌లు, మోటార్ల రిపేరు పనులు చేపట్టారు.
సుద్దగడ్డ కాలువపై కొత్త బ్రిడ్జి నిర్మాణంతో 2,200 మంది గ్రామస్తులకు ప్రయోజనం కలుగుతోంది. సముద్ర తీర ప్రాంత రక్షణకు మొదట్లో 250 కోట్ల రూపాయల ప్రపోజల్ అనుకున్నది, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం సర్వేతో సుమారు 328 కోట్ల రూపాయలతో ప్రపోజల్ సిద్దమవడంతో ఉప్పాడ తీర ప్రాంత ప్రజల్లో ఆనందం నెలకొంది. ఈ ఫైల్‌ ఇప్పటికే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దగ్గర ఉంది. ఇక నీటిపారుదల కోసం పీబీ కాలువ, 4 కోట్ల రూపాయలతో కాలువల మెరుగుదల చేపట్టారు. కొత్త డిగ్రీ కళాశాల ఏర్పాటుతో పాటూ జూనియర్ కళాశాల భవన నిర్మాణం కోసం 50 లక్షల రూపాయలు కేటాయించారు.
32 పాఠశాలల్లో సీఎస్ఆర్ నిధులతో క్రీడా సామగ్రి పంపిణీ చేశారు.

టెంపుల్ సిటీగా పిఠాపురాన్ని అభివృద్ధి చేస్తానన్న హామీలో భాగంగా ఉప్పాడ-కొత్తపల్లిలో 2 కోట్ల రూపాయలతో టీటీడీ కళ్యాణ మండపం నిర్మాణం, గొల్లప్రోలులో శ్రీ సీతారామస్వామి దేవస్థానం పునరుద్ధరణ కోసం 1.32 కోట్ల నిధులు, చెబ్రోలులో 48 లక్షల రూపాయలతో కళాక్షేత్ర మండపం, రథశాల నిర్మాణం, సకలేశ్వర స్వామి ఆలయ పునరుద్ధరణ కోసం కోటి రూపాయలు.. ఇలా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు పవన్‌ కళ్యాణ్‌. 3,456 మంది మహిళలకు మహిళా స్వయం సిద్ధి పథకం కింద 8.64 కోట్ల రూపాయలతో ఉచిత కుట్టు మిషన్లు అందజేసి శిక్షణ కల్పిస్తున్నారు. రైతులకు 2,000 టార్పాలిన్ల పంపిణీ, 1.5 కోట్ల రూపాయలతో ఆధునిక పశువుల మార్కెట్ నిర్మాణం. పర్యావరణం మరియు వ్యర్థాల నిర్వహణలో భాగంగా స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో సాలిడ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించారు. ఇందులో “గార్బేజ్ టు గోల్డ్”, “డ్రైనేజ్ టు డైమండ్” కార్యక్రమాలు ఉన్నాయి. అంతేకాకుండా రైల్వే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కోసం కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా శ్రీపాద వల్లభ స్వామి ఆలయ భక్తుల కోసం రైలు సేవలను మెరుగుపరిచారు.

ALSO READ  Balakrishna: తిరుమలలో నందమూరి బాలకృష్ణ 65వ జన్మదిన వేడుకల హంగామా

Also Read: Shubhanshu Shukla: అంతరిక్షంలో నా విజయానికి కారణం వారే: శుభాంశు శుక్లా

పవన్ కళ్యాణ్ తన ఎమ్మెల్యే జీతంతో పాటూ వ్యక్తిగత నిధులతో కొన్ని సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తన సొంత జీతాన్ని కేటాయించి ప్రతి నెల 40 మంది విద్యార్థులకు 5000 చొప్పున జీవన భృతిగా అందజేస్తున్నారు. అలాగే పిఠాపురం నియోజకవర్గంలో ఒక ఎలక్ట్రీషియన్‌ వర్క్ చేస్తుండగా కరెంట్ షాక్‌తో మృతి చెందడంతో ఇక నుండి నియోజవర్గంలో ఏ ఎలక్ట్రిషన్ పని చేస్తూ మృతి చెందకూడదని ప్రతి ఒక్కరికి 6000 రూపాయలు విలువ చేసే సుమారు 250 కిట్లు అందజేశారు. రక్షా బంధన్ సందర్భంగా, పిఠాపురంలో 40 ఏళ్లలోపున్న 1,500 మంది వితంతు, ఒంటరి మహిళలకు తన సొంత ఖర్చుతో చీరలు పంపిణీ చేశారు. ఈ క్రమంలోనే సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహిస్తున్న మహిళలకు పసుపు కుంకుమ చీరలను పంపిణీ చేయాలని నిర్ణయించారు. మొదట 12 వేల చీరలు పంపిణీ చేయాలనుకుంటే.. అది కాస్తా 15 వేల చీరలయ్యాయి. పిఠాపురం ఆడపడుచుల నుండి ఊహించని స్పందన రావడంతో మరో 3 వేల చీరలను అప్పటికప్పుడు తెప్పించారు. అయినప్పటికీ అంతకు మించి ఎక్కువ సంఖ్యలో మహిళలు రావడంతో కొందరికి చీరలు అందలేదు. వారిలో కొందరు ఆగ్రహంతో పవన్‌కళ్యాణ్‌పై విమర్శలు కూడా చేశారు. ఇలా జరగడానికి కారణం అంచనాకు మించి కార్యక్రమానికి మహిళలు పోటెత్తడమేనట.

ఇలా పవన్‌ కళ్యాణ్‌ చేస్తున్నటువంటి కార్యక్రమాలకు అంచనాలకు మించి మహిళల నుండి రెస్పాన్స్ వస్తోంది. ఈ క్రమంలో చిన్న చిన్న పొరపాట్లు జరిగి అక్కడక్కడా విమర్శలొస్తున్నప్పటికీ.. భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాల్లో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా జాగ్రత్త వహించాలని స్థానిక నేతలు, క్రియాశీల కార్యకర్తలను పవన్‌ ఆదేశించారట.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *