Congress Youth Chief

Congress Youth Chief: లైంగిక ఆరోపణలు.. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాజీనామా

Congress Youth Chief: కేరళ కాంగ్రెస్‌ రాజకీయాలను నాటకీయంగా కుదిపేసిన పరిణామం చోటుచేసుకుంది. ఓ నటి చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలతో రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు, పాలక్కాడ్ ఎమ్మెల్యే రాహుల్‌ మమ్కూతతిల్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఆదూర్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలను పూర్తిగా తోసిపుచ్చుతూ, ఎటువంటి ఒత్తిడి లేకుండా వ్యక్తిగత బాధ్యతతోనే పదవికి వైదొలిగానని స్పష్టం చేశారు.

రిని ఆన్ జార్జ్ ఆరోపణలు

మలయాళ నటి, మాజీ జర్నలిస్ట్‌ రిని ఆన్‌ జార్జ్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఒక యువ రాజకీయ నాయకుడు గత మూడేళ్లుగా తనను వేధిస్తున్నారని వెల్లడించారు. ఫైవ్‌స్టార్‌ హోటల్లో రూమ్‌ బుక్‌ చేశానంటూ అభ్యంతరకర సందేశాలు పంపుతూ వేధింపులకు పాల్పడినట్టు ఆరోపించారు. అయితే ఆ నాయకుడి పేరు, పార్టీని తాను స్పష్టంగా చెప్పడానికి నిరాకరించారు.

ఇది కూడా చదవండి: Breaking: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి వైసీపీ మద్దతు

బీజేపీ – సీపీఎం ఆరోపణలు

రిని జార్జ్‌ వ్యాఖ్యలతో కేరళ రాజకీయాలు వేడెక్కాయి. ఆమె నేరుగా పేరు చెప్పకపోయినా.. బీజేపీ, సీపీఎం వర్గాలు మాత్రం ఈ ఆరోపణల వెనుక రాహుల్‌ మమ్కూతతిల్‌ ఉన్నారని ఆరోపించాయి. ఆయనపై నిరసనలు వ్యక్తమయ్యాయి.

మరో రచయిత్రి ఆరోపణ

ఈ వివాదంలో కొత్త మలుపు తిప్పుతూ రచయిత్రి హనీ భాస్కరన్‌ కూడా రాహుల్‌పై ఆరోపణలు చేశారు. తన పట్ల పదేపదే అసభ్యకరంగా ప్రవర్తించారని, అనుచిత మెసేజ్‌లు పంపారని ఆమె వెల్లడించారు. అంతేకాకుండా యూత్‌ కాంగ్రెస్‌లో ఆయనపై అనేక ఫిర్యాదులు వచ్చినా, ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని హనీ భాస్కరన్‌ తీవ్రస్థాయిలో విమర్శించారు.

కాంగ్రెస్ ప్రతిస్పందన

ఈ వ్యవహారం రాష్ట్ర కాంగ్రెస్‌లో గణనీయమైన కలకలాన్ని రేపింది. పార్టీ సీనియర్ నేత వీడీ సతీశన్‌ మాట్లాడుతూ.. ఈ ఘటనపై అంతర్గత విచారణ మొదలైందని, దోషులు తప్పించుకోలేరని స్పష్టం చేశారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Kharge: మోదీకి మణిపూర్ కనిపించదేంటీ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *