CM Revanth Reddy: తెలంగాణ సీఎం సహాయనిధికి తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ పాలకవర్గం భారీ విరాళం అందజేసింది. సీఎం రేవంత్‌రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని నివాసంలో బుధవారం స్వయంగా కలిసి రూ.1,51,01,116ను పాలకవర్గం అందజేసింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి వెళ్లిన టీజీసీఏబీ చైర్మన్ ఎం రవీంద్‌రావు, వైస్ చైర్మన్ కే సత్తయ్య, ఇతర డైరెక్టర్లు సీఎంను కలిసి విరాళం చెక్కును అందజేశారు.
