Free Bus Services

Free Bus Services: తెలంగాణ, ఏపీ తో పాటు.. 7 రాష్ట్రాల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం..

Free Bus Services: ఎన్నికల్లో గెలవడానికి అన్ని పార్టీలు వలు ఇచ్చే హామీలలో కంపల్సరీ గా ఇచ్చే ఒక్క హామీ మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణం. అలా ఇవ్వడంతోనే గెలిచినా పార్టీలు కూడా ఉన్నాయి. అందుకు నిదర్శనం తెలంగాణ కర్ణాటక లో కాంగ్రెస్ విజయం. మనకి తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్ , కర్ణాటక లో మాత్రమే ఫ్రీ బస్సు సర్వీస్ ఉంది అని అనుకుంటారు. కానీ భారతదేశంలో మహిళల కోసం పలు రాష్ట్రాలు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నాయి. ప్రతి రాష్ట్రంలో వేర్వేరు పేర్లతో ఈ పథకాలు అమల్లో ఉన్నాయి.  ఇపుడు వాటి గురించి తెలుసుకుందాం. 


1. తమిళనాడు

  • పథకం పేరు: విడియల్ పయనం పథకం

  • ప్రారంభం: 2021లో

  • వివరాలు: మహిళలు, ట్రాన్స్‌జెండర్‌లు మరియు వికలాంగులు 30 కిలోమీటర్ల వరకు ప్రభుత్వ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు.


2. కర్ణాటక

  • పథకం పేరు: శక్తి స్కీమ్

  • ప్రారంభం: జూన్ 2023

  • వివరాలు: కర్ణాటక రాష్ట్రానికి చెందిన మహిళలు, ట్రాన్స్‌జెండర్‌లు అన్ని సాధారణ RTC బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. లగ్జరీ, AC, అంతర్రాష్ట్ర బస్సులకు మాత్రం ఇది వర్తించదు. ప్రయాణం కోసం శక్తి స్మార్ట్ కార్డు ఇస్తారు.


3. ఆంధ్రప్రదేశ్

  • పథకం పేరు: స్త్రీ శక్తి

  • ప్రారంభం: ఆగస్టు 15, 2025

  • వివరాలు: మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్‌లు APSRTC నడిపే పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. AC, ఇంటర్‌స్టేట్ బస్సులకు మాత్రం ఇది వర్తించదు.


4. తెలంగాణ

  • స్థితి: కొత్తగా ఉచిత బస్సు పథకం తీసుకురావాలని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇంకా పూర్తి వివరాలు ప్రకటించలేదు.


5. ఢిల్లీ

  • పథకం పేరు: పింక్ టికెట్ పథకం → ఇప్పుడు సహెలీ స్మార్ట్ కార్డు

  • ప్రారంభం: 2019లో పింక్ టికెట్‌తో, 2025లో సహెలీ కార్డు ప్రారంభం

  • వివరాలు: మహిళలు DTC మరియు క్లస్టర్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఇప్పటివరకు పింక్ టికెట్ ఇచ్చేవారు, ఇకపై స్మార్ట్ కార్డు ద్వారా ఉచిత ప్రయాణం లభిస్తుంది.


6. పంజాబ్

  • పథకం: మహిళలకు ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణం

  • ప్రారంభం: 2021

  • వివరాలు: మహిళలు PRTC, Punbus, సిటీ బస్సుల్లో ఉచితంగా వెళ్ళవచ్చు. అయితే AC, వోల్వో బస్సులకు మాత్రం ఇది వర్తించదు.


7. జమ్మూ & కాశ్మీర్

  • పథకం పేరు: జీరో టికెట్ పథకం

  • ప్రారంభం: ఏప్రిల్ 1, 2025

  • వివరాలు: మహిళలు, బాలికలు రాష్ట్ర ప్రభుత్వ SRTC మరియు స్మార్ట్ సిటీ ఈ-బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు.

ALSO READ  Delhi Elections: బీజేపీకి ముస్లింలు శత్రువులు కాదు..

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *