Shruti Haasan: టాక్ తో సంబంధం లేకుండా, సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది కూలీ మూవీ. 74 ఏళ్ల ఏజ్ లోనూ సూపర్ స్టార్ బాక్సాఫీస్ ర్యాంపేజ్ చూసి ఇండస్ట్రీ వారు కూడా షాక్ అవుతున్నారు. రీసెంట్ గా కూలీ చూడ్డానికి థియేటర్ కెళ్లిన శృతి హాసన్ కి షాకిచ్చారు ఆడియన్స్. నేను ఈ సినిమాలో హీరోయిన్ ని.. దారి వదలండన్నా ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేసింది.. అసలేం జరిగిందంటే..
Also Read: OG: పవన్ కళ్యాణ్ ‘ఓజీ’లో హీరోయిన్ లుక్ రివీల్: కన్మణిగా ప్రియాంక మోహన్!
లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో, సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించిన కూలీ మూవీ చూడ్డానికి, ఫ్రెండ్స్ తో కలిసి, చెన్నైలోని ఓ థియేటర్ కి వెళ్లింది శృతి హాసన్. జనాలు అడ్డుగా ఉండడంతో లోపలికి వెళ్లడానికి దారి ఇవ్వండంటూ సందడి చేసింది. నేనీ సినిమాలో ఉన్నాను, ప్లీజ్ వదిలెయ్యండన్నా.. నేను ఈ సినిమాలో హీరోయిన్ ని సార్ అంటూ ఫన్నీగా రిక్వెస్ట్ చెయ్యడంతో.. ఫ్రెండ్స్ అంతా ఫుల్ గా నవ్వేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ప్రీతి క్యారెక్టర్ లో శృతి నటనకు మంచి అప్లాజ్ వస్తోంది.
— Prakash Mahadevan (@PrakashMahadev) August 15, 2025