Sri Lanka:సరిహద్దు దాటి తమ సముద్ర జలాల్లోకి వచ్చారన్న కారణంతో శ్రీలంక 68 భారత జాలర్లను అదుపులోకి తీసుకున్నది. 235 భారత జాలర్ల పడవలను కూడా స్వాధీనం చేసుకున్నది. వీరిలో 14 మంది తమిళనాడు రాష్ట్రానికి చెందిన జాలర్లు ఉన్నారు. ఈ మేరకు తమ రాష్ట్ర జాలర్లను విడిపించేందుకు చొరవ చూపాలని తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
Sri Lanka:ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్‌కు ఇటీవలే తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ లేఖ రాశారు. తమ రాష్ట్రానికి చెందిన 14 మంది జాలర్లను తమ జలాల్లోకి ప్రవేశించారన్న ఆరోపణలతో శ్రీలంక నేవీ అధికారులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. శ్రీలంక ఉత్తర ప్రావిన్స్‌లోని మన్నార్ సమీపంలో జాలర్లను అరెస్టు చేయడంతోపాటు రెండు మర పడవలను స్వాధీనం చేసుకున్నారని ముఖ్యమంత్రి స్టాలిన్ ఆ లేఖలో పేర్కొన్నారు.
Sri Lanka:జాలర్లను వారి పడవలను విడిపించేందుకు కేంద్ర ప్రభుత్వం దౌత్యపరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి స్టాలిన్ కేంద్ర మంత్రిని కోరారు. తమ రాష్ట్ర జాలర్లతో కలిసి శ్రీలంక చెరలో 68 మంది భారత జాలర్లు, 235 పడవలు ఉన్నాయని తాను రాసిన లేఖలో స్టాలిన్ పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయని ఆయన కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.