Indian Railways: వచ్చే ఏడాది జనవరిలో ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో జరగనున్న మహా కుంభమేళాను పురస్కరించుకొని దేశవ్యాప్తంగా 13 వేల రైళ్లను నడుపనున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది. వీటిలోనే 3 వేల ప్రత్యేక రైళ్లను నడుపుతామని ప్రకటించింది. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరగనున్న ఈ కుంభమేళాకు దాదాపు దేశవ్యాప్తంగా 2 కోట్ల వరకు భక్తులు చేరుకునే అవకాశం ఉంది. కుంభమేళాకు వచ్చే యాత్రికులకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు నడిపే రైళ్ల కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్టు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.