Pulivendula ZP War

Pulivendula ZP War: జగన్ అడ్డాలో బీటెక్ రవి పద్మవ్యూహం ఫలించనుందా?

Pulivendula ZP War: జడ్పీటీసీ ఉప ఎన్నికతో పులివెందుల రాజకీయం హీటెక్కింది. పులివెందులలో జగన్‌ని ఓడించి ఎమ్మెల్యే పీఠాన్ని అధిరోహించి చరిత్ర సృష్టించాలన్నది బీటెక్‌ రవి జీవితాశయంగా పెట్టుకున్నారు. ఇక టీడీపీ సైతం వైనాట్‌ పులివెందుల నినాదంతోనే 2029 ఎన్నికలకు వెళ్లనుంది. ఈ నేపథ్యంలో పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని వ్యూహాలు రచిస్తున్నారు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ బీటెక్ రవి. స్వయానా బీటెక్ రవి సతీమణే ఇక్కడ పోటీలో నిలుచున్నారు. మరి మాజీ సీఎం జగన్ అడ్డాలో బీటెక్ రవి పద్మవ్యూహం ఫలించనుందా?
టీడీపీ అష్టదిగ్బంధనంలో వైసీపీ ఇరుక్కుంటుందా? పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ బోణి కొట్టానుందా? ఇప్పుడిదే పులివెందుల పూలంగళ్ల సెంటర్‌లో నడుస్తున్న హాట్‌ డిస్కషన్.

జగన్ సొంత అడ్డాలో పరువు కోసం వైసీపీ పాకులాడుతోంటే.. పట్టు కోసం టీడీపీ ఎత్తులు వేస్తోంది. చిన్న పామునైనా పెద్దకర్రతో కొట్టాలన్న ఆలోచనలో పులివెందుల టీడీపీ ఇంచార్జ్ పావులు కదుపుతున్నారు. 2017లో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ మంత్రి వైఎస్ వివేకాపై గెలిచిన ట్రాక్‌ రికార్డ్‌ బీటెక్ రవి సొంతం. అందువల్లే ఈ జెడ్పీటీసీ ఉప ఎన్నికలో ఓటమి భయం పట్టుకుందట వైసీపీకి. జిల్లా ఇంచార్జ్ మంత్రి సవిత సైతం పులివెందుల ఉప ఎన్నికపై ప్రత్యేక దృష్టి సారించారట. పులివెందులలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారా? బీజేపీ, జనసేన, టీడీపీ కలిసికట్టుగా కూటమి అభ్యర్థిని గెలిపించనున్నారా? అన్న చర్చ అంతటా జరుగుతోంది.

Also Read: Amit Shah: అమిత్ షా సరికొత్త రికార్డు: హోంమంత్రిగా అద్వానీ రికార్డు బద్దలు!

కూటమి అభ్యర్థిగా బీటెక్ రవి సతీమణి మారెడ్డి లతా రెడ్డి నామినేషన్ వేస్తే, వైసీపీ నుంచి మృతి చెందిన జెడ్పీటీసీ మహేశ్వర్ రెడ్డి సతీమణి తుమ్మల ఉమాదేవి నామినేషన్‌ వేశారు. వివేకా హత్య కేసులో A4 నిందితుడిగా ఉన్న సునీల్ యాదవ్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తుంటే, కాంగ్రెస్ నుంచి తుమ్మలూరు అనిల్ కుమార్ రెడ్డి బరిలో నిలబడ్డారు. కూటమి కలయికతో గెలుపుపై ధీమాతో ఉన్నారు బీటెక్ రవి. పులివెందులలో జగన్‌కు చెక్ పెట్టాలని ఎదురుచూస్తున్న కూటమికి ఇది మంచి అవకాశం అంటున్నారు పరిశీలకులు. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి 11 సీట్లు ఇచ్చి మూలన కూర్చోబెట్టారు. రాష్ట్రాన్ని అన్ని విధాలా సర్వ నాశనం చేసిన జగన్‌కు పులివెందుల నుంచే ఫుల్ స్టాప్ పెట్టే దిశగా కూటమి నేతలు వ్యూహ రచన చేస్తున్నారు.

ALSO READ  Avinash Reddy in liquor scam: లిక్కర్‌ పార్టీ ప్రొడక్షన్‌లో బయటపడ్డ మరో 3 సినిమాలు

జెడ్పీటీసీ ఉప ఎన్నికకు టీడీపీ అధిష్టానం నుంచి గ్రీస్ గ్రీన్ సిగ్నల్ రావడంతోనే కూటమి నేతల్లో జోష్ మొదలైందని చెప్పాలి. ఈ ఎన్నిక ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో.. ఇంచార్జ్ మంత్రి సవిత, బీజేపీ ఫైర్ బ్రాండ్ ఆదినారాయణ రెడ్డి, పులివెందుల ఇంచార్జ్ బీటెక్ రవి, ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస రెడ్డిలు ఫుల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు బీజేపీ ఎంపీ సీఎం రమేశ్‌ సైతం కూటమి అభ్యర్థి గెలుపు కోసం రంగంలోకి దిగారట. ఏది ఏమైనా పులివెందుల టగ్ ఆఫ్ వార్‌లో బీటెక్ రవి ఈజ్ బ్యాక్ అంటున్నారు విశ్లేషకులు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *