NTR-Prashanth Neel: ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న సినిమా గురించి మరో సంచలన వార్త రానే వచ్చేసింది. ఈ చిత్రంలోని ఓ భారీ యాక్షన్ సన్నివేశం కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రాండ్ సెట్ నిర్మిస్తున్నారట. ఈ సీన్స్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ లుక్, యాక్షన్ అదిరిపోనున్నాయని టాక్. ‘డ్రాగన్’ అనే టైటిల్‌తో ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్‌లోనే బెస్ట్‌గా నిలవనుందని అంటున్నారు. ప్రశాంత్ నీల్ స్క్రిప్ట్ కోసం ఎక్కువ సమయం కేటాయించి, ఈ సినిమాను గ్రాండ్‌గా తీర్చిదిద్దుతున్నారట.
Also Read: Hyderabad: సంచలన నిర్ణయం.. రేపటి నుంచి షూటింగ్ లు బంద్..
ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబో సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలోని ఓ కీలక యాక్షన్ సీక్వెన్స్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్ నిర్మాణం జరుగుతోంది. ఈ సన్నివేశాలు వైల్డ్ విజువల్స్‌తో ఆకట్టుకోనున్నాయట. ఎన్టీఆర్ గెటప్, యాక్షన్ స్టైల్ థ్రిల్‌గా ఉంటాయని సమాచారం. ‘డ్రాగన్’ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రం, మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై నిర్మితమవుతోంది. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ప్రశాంత్ నీల్ బెస్ట్ ఔట్‌పుట్‌గా నిలవడం ఖాయమట.