71st National Film Awards

71st National Film Awards: 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు!

71st National Film Awards: 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాలు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయి. నందమూరి బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ ఉత్తమ తెలుగు చిత్రంగా అవార్డు గెలుచుకుంది. ‘బలగం’ చిత్రంలోని ‘ఊరు పల్లెటూరు’ పాటకు కాసర్ల శ్యామ్ బెస్ట్ లిరిక్స్ అవార్డు అందుకున్నారు. ‘బేబీ’ చిత్రానికి సాయి రాజేష్ ఉత్తమ స్క్రీన్‌ప్లే, ‘హనుమాన్’ చిత్రానికి ఉత్తమ యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్ అవార్డు దక్కాయి. నాన్-ఫీచర్ విభాగంలో ‘గాడ్ వల్చర్ అండ్ హ్యూమన్’ ఉత్తమ డాక్యుమెంటరీగా నిలిచింది. తమిళ చిత్రం ‘పార్కింగ్’ ఉత్తమ తమిళ చిత్రంగా, ‘12th ఫెయిల్’ ఉత్తమ ఫీచర్ ఫిల్మ్‌గా అవార్డులు గెలుచుకున్నాయి. రాణి ముఖర్జి ఉత్తమ నటిగా, షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సె ఉత్తమ నటులుగా ఎంపికయ్యారు. మొత్తానికి తెలుగు సినిమా ఇండస్ట్రీ ఈ అవార్డులతో దేశవ్యాప్తంగా మరోసారి గర్వకారణమైంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Reddeppa: ఆ పవర్‌ఫుల్‌ దంపతులపై చంద్రబాబుకు ఫుల్‌ క్లారిటీ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *