Reddeppa: కడపలో జరిగిన తెలుగుదేశం మహానాడు గ్రాండ్ సక్సెస్ అయ్యింది. కడప ఇలాకాలో జగన్ రెడ్డికి దడపుట్టించింది. మూడు రోజులు కదం తొక్కిన పసుపు సైన్యం.. సైకిల్ పార్టీ సత్తాని చాటింది. అయితే మూడో రోజు మహా సభలో ఓ దృశ్యం అందర్నీ కదిలించింది. పడ్డ కష్టానికి, లభించిన గుర్తింపుకు, అధినేత నుంచి దక్కిన ప్రశంసకు.. సంతోషం పట్టలేక.. తన ఆనందాన్ని కన్నీటి రూపంలో వ్యక్తం చేశారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి. ఉమ్మడి కడప జిల్లాలో టీడీపీకి కీలక నేతగా ఉన్న రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి, కడప ఎమ్మెల్యే అయిన ఆయన సతీమణి మాధవిరెడ్డి.. కడప మహానాడు సక్సెస్‌లో తమ వంతు కీలక పాత్ర పోషించారు. కడప అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరేసేందుకు ఎన్నికల ముందు నుండీ ఎంతో కష్టపడ్డ శ్రీనివాసరెడ్డి, మాధవి రెడ్డి దంపతులు.. అదే కడపలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మహానాడు కోసం అంతే కష్టపడ్డారు. మహానాడును కడపలో పెట్టాలని నిర్ణయించిన దగ్గర నుంచీ.. మూడు రోజుల మహానాడు భారీ సక్సెస్ అయ్యే వరకూ.. తమకు అప్పగించిన రోల్‌ని సమర్థవంతంగా పోషించారు. చరిత్రలో చూడని విధంగా కడప గడపను పసుపు మయం చేయడంలో ఈ దంపతులది కీ రోల్. తమ కష్టంతో చంద్రబాబు, లోకేష్‌ల మనసు గెలిచారు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి, మాధవి రెడ్డి దంపతులు.
Also Read: Mahanadu Resolutions: ఎన్టీఆర్ సిద్ధాంతాలను లోకేష్ టచ్ చేశారా?
శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే మాధవి రెడ్డి దంపతుల కష్టాన్ని అధినేత, యువనేతలు గుర్తించారు. కడప నియోజకవర్గంలో మాధవి రెడ్డి ఘన విజయం.. మహిళా శక్తికి నిదర్శనం అంటూ రెండో రోజు మహానాడులో సీఎం చంద్రబాబు ప్రత్యేకించి ప్రస్తావించారు. ఇక మూడో రోజు… మహానాడు మహా వేదికపై.. లక్షలాది మంది పార్టీ శ్రేణుల ఎదుట.. ప్రత్యేకంగా రెడ్డప్పగారి శ్రీనివాసుల రెడ్డిని ఆప్యాయంగా దగ్గరకు పిలిచి.. కితాబిచ్చారు చంద్రబాబు. అధినేత చూపించే ప్రేమ, తండ్రిలా కనబరిచే వాత్సల్యం కన్నా.. కిక్ ఇచ్చే అంశం మరొకటి ఏముంటుంది ఏ నేతకైనా! అందుకే.. ఆ ఆనందాన్ని దాచుకోలేక.. ఆనందభాష్పాలు రాల్చారు రెడ్డప్పగారి శ్రీనివాసుల రెడ్డి. నిండైన మనిషి, తొణకని, బెణకని వ్యక్తిత్వం. ప్రత్యర్థులు ఎంత రెచ్చగొట్టినా రాజకీయాల్లో ఎప్పుడూ బ్యాలెన్స్ కోల్పోయిన చరిత్ర లేదు. రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి అంటే తెలిసిందిదే ఎవరికైనా. కానీ.. అధినేత ఆలింగనంలో చిన్న పిల్లాడిలా మారిపోయిన శ్రీనివాసరెడ్డిని చూసి.. ఒక్కసారిగా కడప తమ్ముళ్లు భావోద్వేగానికి గురయ్యారు.
ఇంతకీ శ్రీనివాస రెడ్డి, మాధవి రెడ్డి దంపతులంటే చంద్రబాబుకు అంత గురి ఎందుకు? కారణం వారి కమ్మిట్‌మెంట్, పార్టీ పట్ల కనబరిచే లాయల్టీనే. ఇచ్చిన పనిని వంద శాతం ఇంప్లిమెంట్ చేయడంలో సమర్థులు ఈ దంపతులు. అదే వీరికి ప్లస్ పాయింట్. ఉమ్మడి కడప జిల్లాలో కూటమికి 7 సీట్లు వచ్చినా, కడప సెగ్మెంట్‌లో మాధవి రెడ్డి గెలుపుదే కీ ఇంపాక్ట్. కడప అంటే రెడ్డప్పగారి దంపతులు అనేలా మారిపోయింది సీన్. సాధారణంగా దంపతుల్లో ఒకరు ఫైర్ అయితే, మరొకరు నెమ్మదస్తులుగా ఉంటారు. కానీ శ్రీనివాసరెడ్డి, మాధవిరెడ్డి దంపతులు ఇద్దరూ ఫైర్ బ్రాండ్‌లే. ప్రత్యర్థులపై మాటల దాడి చేయడంలో ఇద్దరూ ఇద్దరే. తాజాగా మహానాడు నిర్వహణ కమిటీలో భాగస్వామ్యం అయ్యి… అధినేత, యువనేత సూచనలను పక్కాగా ఇంప్లిమెంట్ చేసి, తమ సమర్థతను మరోసారి నిరూపించుకున్నారు.
Also Read: Mahanadu Committees: మహానాడు ఎఫెక్ట్.. లోకేష్ టీమ్ రివీల్?
Reddeppa: మహానాడును రాయలసీమ ప్రాంతంలోని కడప జిల్లాలో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నప్పుడు… కడపలో నిర్వహించాలా? పులివెందులలో నిర్వహించాలా? మరేదైనా నియోజకవర్గంలో ప్లాన్ చేయాలా? అన్న చర్చల సందర్భంలో.. జిల్లా హెడ్ క్వాటర్స్ అయిన కడపలో నిర్వహించడమే అన్ని విధాలుగా సమంజసం అన్న సూచనని అధినేత, యువనేతల దృష్టికి తీసుకెళ్లి.. కడపకు సమీపంలోనే మహానాడు నిర్వహించేలా చేసుకోగలిగారు రెడ్డప్పగారి దంపతులు. ఇక మహానాడు సభల్లో మాటల తూటాలతో ఈ దంపతులిద్దరూ హైలైట్ అయ్యారు. కడప ఎవరి అడ్డా కాదన్న ఎమ్మెల్యే మాధవిరెడ్డి, తెలుగుదేశం కార్యకర్త జోలికొస్తే వారికి అదే ఆఖరి తప్పు అవుతుందని హెచ్చరించారు. ఇది కడప రెడ్డెమ్మ శాసనం అని, దీన్ని అతిక్రమించే దమ్ము ఎవరికీ లేదని చెప్పుకుంటున్నారు ఇప్పుడు అక్కడి టీడీపీ కార్యకర్తలు. జగన్ లాంటి నాయకుడు ఉన్న చోట.. ఒక మహిళ నోట ఆ మాట.. కడప రాజకీయాలను మలుపు తిప్పేలా చేసిందంటున్నారు విశ్లేషకులు.
దశాబ్దాల తర్వాత కడప గడ్డపై పరుగులు పెడుతున్న సైకిల్‌కు… శ్రీనివాస రెడ్డి, మాధవిరెడ్డి దంపతులు ఇద్దరూ రెండు చక్రాల్లా మారారు. వారి కమ్మిట్‌మెంట్, లాయల్టీ.. అధినేత ఎప్పటికప్పుడు గుర్తిస్తూ, ప్రోత్సహిస్తుండటం… వారి పొలిటికల్ కెరీర్‌కు ప్లస్‌గా మారుతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.