Amaravati: రాజధాని అమరావతిని అన్ని రంగాల్లో అభివృద్దికి కావాల్సిన ప్రణాళికలు సిద్దం చేసింది సిఆర్డియో..ఇప్పటికే ప్రభుత్వ భవనాల సమూదాయాలు నిర్మాణం పూర్తి చేసేలా.. కొత్తగా టెండర్లు ప్రక్రియను వచ్చే నెలా చివరి వారంలోగా పూర్తి చేయనుంది..జనవరి నుండి పూర్తి స్థాయిలో అమరావతిలో పనులు వేగవంతం చేయాలని భావిస్తోంది..ఇదే క్రమంలో అమరావతిలో ఇన్ఫ్రాస్ట్రక్షర్ డవలప్మెంట్..వివిధ రంగాల భాగస్వామ్యం, తదనుగుణ వాణిజ్యాభివృద్ధి, ఉపాధి కల్పన లక్ష్యాలుగా సిఆర్డియో ప్రణాళికలు సిద్దం చేసింది..
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో.. అమరావతికి మరలా మహర్ధశ పట్టింది..గత ఐదేళ్ల జగన్ పాలనలో రాజధాని ఏదో కూడా చేప్పుకోలేని దుస్థితి నెలకొంది..ఏపి రాజధాని అమరావతే అని సీఎం చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు..ఇదే సమయంలో ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ లో రాజధాని అమరావతి నిర్మాణానికి 15 వేల కోట్లు నిధులు కేటాయింపులు చేసింది..ఈ నెల మూడో వారంలోగా సిఆర్డియో అకౌంట్ లోకి ప్రపంచబ్యాంకు నిధులు విడుదల చేయనుంది..దీంతో అమరావతి రాజధాని పనులు వచ్చే నెల నుండి వేగం పంచుకోనున్నాయి .రాజధానిలో గతంలో ఆగిపోయిన పనులు అన్ని తిరిగి ప్రారంభం కానుండటంతో..అమరావతికి పూర్వ వైభవం దిశగా అడుగులు పడుతున్నాయి..ఒక పక్క ప్రభుత్వ భవనాలు నిర్మాణంతో పాటు..మరోపక్క కేంద్రం ప్రభుత్వం సంస్థలు.. ప్రభుత్వ రంగ సంస్థల భవనాల నిర్మాణానికి కూడా సిఆర్డియో సంప్రదింపులు జరుపుతుంది..గతంలో భూములు కేటాయింపులు వరకు వచ్చి ఆగినపోయిన అన్ని ప్రతిపాదనలు మరలా పట్టాలెక్కించేందుకు సిఆర్డియో అధికారులు కృషి చేస్తున్నారు..
ఇది కూడా చదవండి: Anakapalli: ష్.. ఎంపీడీవో సార్ నిద్రపోతున్నారు.. డోంట్ డిస్టర్బ్
Amaravati: ఇదే క్రమంలో అమరావతిలో వేల కోట్ల రుపాయిల పెట్టుబడులను అకర్షించడానికి కావాల్సిన ప్రణాళికలు కూడా సిఆర్డియో సిద్దం చేసింది..ఇందులో భాగంగా అమరావతిలో 300 ఎకరాల్లో ఇండస్ట్రీయల్ పార్క్..198 ఎకరాల్లో ఐటీ పార్క్..150 ఎకరాల్లో గోల్ప్ రిసార్ట్..50 ఎకరాల్లో మల్డీ మోడల్ లాజస్టిక్ హబ్.. 50ఎకరాల్లో కనస్ట్రక్షన్ సిటీ..20 ఎకరాల్లో లీషర్ రిసార్ట్..20 ఎకరాల్లో ఇంటిగ్రీటెడ్ బిజినెస్ పార్క్..20 ఎకరాల్లో ఎంఐసిఇ హబ్..20 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ హబ్..15 ఎకరాల్లో టూరిజం డిస్ట్రిక్ట్…5ఎకరాల్లో కన్వెన్షన్ సెంటర్.7 ఎకరాల్లో కమర్షియల్ మాల్..3 ఎకరాల్లో లీగర్ సర్వీస్ కాంప్లెక్స్ వంటి నిర్మాణాలను ప్రతిపాదించింది.. అమరావతిలో ఇన్ఫ్రాస్ట్రక్షర్ డవలప్మెంట్ జరగనుంది..నూతన నగరంలో ఎకానామిక్ గ్రోత్ పెరిగే అవకాశం ఏర్పడుతుందని భావిస్తోంది..పర్యాటకం, క్రీడాభివృద్దికి వంటి వాటికి కూడా అవకాశాలు పెరగనున్నాయి..దీని వలన వేల కోట్లు రుపాయిలు పెట్టుబడులు రావడంతో పాటు..లక్షల సంఖ్యలో ఉపాధి అవకాశాలు కూడా పెరిగే అవకాశం ఉందని సిఆర్డియో భావిస్తోంది.
వచ్చే ఐదేళ్ల లో అమరావతి నిర్మాణం దాదాపు పూర్తి చేసేలా సిఆర్డియో ప్లాన్ చేస్తోంది..దీనికి టైమ్ లైన్ ప్రతిపాదనలు సిద్దం చేసింది..రాజధానికి నిధులు కొరత లేక పోవడంతో..రాజధాని నిర్మాణం నిర్దేశించిన లక్ష్యం లోగా పూర్తి అవుతుందని కూటమి సర్కార్ భావిస్తోంది.