Air India flight: విమానంలో ప్రయాణం.. అప్పటికి భూమి నుంచి 35 వేల అడుగుల ఎత్తులో విమానం వెళ్తుంది.. ఆ సమయంలో అందులో ఓ నిండు గర్భిణి అయిన ప్రయాణికురాలు కూడా ఉన్నది.. ఆమెకు పురిటి నొప్పులు రాసాగాయి.. అప్పుడే ఆమె ప్రసవించడం, తల్లీబిడ్డ క్షేమంగా ఉండటం జరిగాయి. ఇది విమానం సిబ్బంది, తోటి మహిళా ప్రయాణికుల సహకారంతో జరిగింది.
Air India flight: విమాన ప్రయాణంలో ఉండగానే ఓ మహిళ ప్రసవించింది. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఒమన్ రాజధాని మస్కట్ నుంచి ముంబైకి వస్తున్న ఎయిరిండియా విమానంలో థాయ్‌లాండ్‌కు చెందిన ఓ నిండు గర్భిణికి పురిటి నొప్పులు వచ్చాయి. విమానంలోనే ఉన్న ఓ నర్సు ఆమెకు ప్రసవం చేయగా, మగబిడ్డకు జన్మనిచ్చింది. ముంబై చేరుకోగానే తల్లీబిడ్డను ఆసుపత్రికి తరలించారు.