Hyderabad: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు దారితీసే కీలక నిర్ణయం తీసుకుంది. జడ్పీ, ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీ స్థాయిలోని స్థానాలను తాజాగా నిర్ధారిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా నిర్ధారిత స్థానాల వివరాలు:
జిల్లా పరిషత్‌లు (జడ్పీ): 31
మండల పరిషత్‌లు (ఎంపీపీ): 566
జడ్పీటీసీ స్థానాలు: 566
ఎంపీటీసీ స్థానాలు: 5,773
గ్రామ పంచాయతీలు: 12,778
పంచాయతీ వార్డులు: 1,12,000 (లక్షా 12 వేలు)
ఈ ప్రక్రియ అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌కు మార్గం సుగమం కానుంది. ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు వేగవంతం చేయనుంది. త్వరలోనే రిజర్వేషన్ల ప్రక్రియ, ఓటర్ల జాబితాల నిర్వహణ మొదలైనవి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.