Coconut Storage Tips: భారతీయ వంటగదిలో కొబ్బరి లేకుండా ఉండదు. కొబ్బరిని సాంబార్, నాన్వెజ్, స్వీట్ల తయారీలో ఉపయోగిస్తారు. కొన్నిసార్లు పగిలిన కొబ్బరికాయను నిల్వ చేయడం చాలా కష్టంగా మారుతుంది. ఒకట్రెండు రోజులకే అది పాడవుతుంది. ఈ క్రమంలో కొబ్బరిని సరైన పద్దతిలో ఎలా నిల్వ చేయాలన్నది తెలుసుకోవడం చాలా ముఖ్యం. కొబ్బరి ఎక్కువ కాలం నిల్వ ఉంచే చిట్కాలను ఇప్పుడు తెలుసుకుందాం.
తురిమిన కొబ్బరిని ఫ్రిజ్ లో ఉంచితే వారం రోజుల వరకు పాడవదు. కానీ కొబ్బరిని గాలి చొరబడని డబ్బాలో ఉంచడం మంచిది.
కొబ్బరిని ఎండలో ఆరబెట్టాలి. ఎండలో పెట్టడం వల్ల శ్లేష్మం ఉత్పత్తి కాదు. దాంతో అది ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది.
కొబ్బరిని ఒక గిన్నెలో ఉంచి స్టవ్ మీద వేడి చేసి గాజు పాత్రలో నిల్వ చేయాలి. అలా చేస్తే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది.
కొబ్బరిని భద్రపరచడానికి మరొక మార్గం వాటిని ఉప్పు పాత్రలలో నిల్వ చేయడం. పగిలిన కాయను ఉప్పు డబ్బాలో ఉంచితే ఎక్కువ రోజుల వరకు చెడిపోకుండా ఉంటుంది.
వరి గడ్డి లోపల పగలగొట్టిన కొబ్బరికాయలను నిల్వ చేయడం ఉత్తమమైన పద్ధతుల్లో ఒకటి. ఈ గడ్డిలోని ఉష్ణోగ్రత వల్ల కాయలు పాడవకుండా తాజాగా ఉంటాయి.
పగిలిన కాయ ఉంటే దానిపై కాస్త పసుపు రాస్తే కాయ పాడైపోదు. ఇలా వివిధ పద్ధతుల్లో కొబ్బరిని ఎక్కువ కాలం నిల్వ చేయవచ్చు.