Earthquake

Earthquake: ఢిల్లీలో భూప్రకంపనలు.. రిక్టర్ స్కేల్‌పై 4.1గా నమోదు

Earthquake: దేశ రాజధాని ఢిల్లీకి తిప్పలు తగ్గడం లేదు. గురువారం ఉదయం భూప్రకంపనలు కలకలం రేపాయి. దాదాపు ఉదయం 9.4 గంటల సమయంలో భూమి కంపించింది. ఢిల్లీతో పాటు ఎన్‌సీఆర్ ప్రాంతాలు కూడా కంపించాయి. రిక్టర్ స్కేల్‌పై 4.1 తీవ్రతగా భూకంపం నమోదైంది.

భూమి సుమారు ఒక నిమిషం పాటు కంపించిందని అధికారులు చెప్పారు. హర్యానాలోని రోహతక్ సమీపంలో భూకంప కేంద్రం గుర్తించారు.

ఈ భూకంపం తర్వాత ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తినష్టం వివరాలు తెలియరాలేదు.

మరోపక్క భారీ వర్షాలతో నగరమే జలదిగ్బంధం

ఇక ఇప్పటికే ఢిల్లీలో బుధవారం సాయంత్రం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాత్రంతా కుండపోత వర్షం కురవడంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది.

అధిక భాగం ప్రాంతాల్లో రోడ్లు మోకాలి లోతు నీటితో నిండిపోయాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఉద్యోగులు, విద్యార్థులు ప్రయాణంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.విమాన రాకపోకలు కూడా అంతరాయంకు గురయ్యాయి.

‘రెడ్ అలర్ట్’ ప్రకటించిన వాతావరణ శాఖ

వర్షం ప్రభావం పెరుగుతుండటంతో భారత వాతావరణ శాఖ (IMD) ఆరెంజ్ అలర్ట్‌ను ‘రెడ్ అలర్ట్’గా మార్చింది.
నజాఫ్‌గఢ్ ప్రాంతంలో 60 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

Also Read: Bandi Sanjay: కట్టర్‌ సమూహమే కాదు, బడి పిల్లలూ ఆయన సైన్యమే!

గురువారం కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని హెచ్చరించారు. నెహ్రూ ప్లేస్, లజ్‌పత్ నగర్, అరబిందో మార్గ్ వంటి ముఖ్య ప్రాంతాల్లో ట్రాఫిక్‌ పూర్తిగా నిలిచిపోయింది.

గురుగ్రామ్‌లో పరిస్థితి మరింత దారుణం

గురుగ్రామ్లో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంది.అనేక అపార్ట్‌మెంట్లలోకి వర్షపు నీరు ప్రవేశించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో ప్రజలు తమ సమస్యలను పంచుకుంటున్నారు.

సామాన్య ప్రజలకు హెచ్చరిక

వర్షాలు, భూకంపం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
అత్యవసరమైతే తప్ప ఇంటి బయటకు రావొద్దని సూచిస్తున్నారు.


తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Mahaa Vamsi: పవన్ పిడుగుల్లాంటి అడుగులు..జగన్ కోటలో బీటలు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *