OG: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమాల్లో సుజీత్‌తో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ “ఓజీ” ఒకటి. ఈ చిత్రం పవన్ కెరీలోనే ఓ స్పెషల్ హైప్‌ను సొంతం చేసుకుంది. గత ఏడాది రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాలతో ఈ ఏడానికి వచ్చింది. మధ్యలో “హరిహర వీరమల్లు” సినిమా “ఓజీ” రిలీజ్‌కు ఆటంకంగా మారుతందని, ఈ సినిమా వచ్చే వరకు “ఓజీ” డేట్ క్లియర్ కాదని గుసగుసలు వినిపించాయి.
Also Read: Boycott Sitaare Zameen Par: సితారే జమీన్ పర్ సినిమాపై ఆగని బాయ్‌కాట్ ట్రెండ్!
OG: అంటే “వీరమల్లు” “ఓజీ” రిలీజ్ డేట్ సెప్టెంబర్ 25న వస్తుందని, అందువలన “ఓజీ” మరో డేట్‌కు షిఫ్ట్ అవుతుందని సోషల్ మీడియాలో టాక్ వైరల్‌గా మారింది. కానీ, “హరిహర వీరమల్లు” జూలై 24న విడుదలవుతుందని అధికారికంగా ప్రకటించడంతో “ఓజీ”కి లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. ఈ రెండు భారీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తాయో చూడాలి. మొత్తానికి పవన్ కళ్యాణ్ ఈ రెండు సినిమాలతో ఫ్యాన్స్‌కు డబల్ ధమాకా ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు!