Manchu Vishnu

Manchu Vishnu: అస్సలు తగ్గేదేలే అంటున్న విష్ణు?

Manchu Vishnu: మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘కన్నప్ప’ పై అందరి దృష్టి నెలకొని ఉంది. ఇది విష్ణు కెరీర్‌లో అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న డ్రీమ్ ప్రాజెక్ట్ కాగా, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పలువురు టాప్ స్టార్స్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ దాదాపు 30 నిమిషాల పాటు స్క్రీన్‌పై ఆకట్టుకోనున్నారని టాక్ వినిపిస్తోంది.

ఈ చిత్రం కోసం మేకర్స్ ఇప్పటి నుంచే జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. మంచు విష్ణు కూడా ఉత్సాహంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ అభిమానుల్లో హైప్ పెంచుతున్నాడు. తాజాగా, ఈ సినిమా రిలీజ్ డేట్‌పై క్లారిటీ ఇస్తూ, జూన్ 27న ఎట్టి పరిస్థితుల్లోనూ థియేటర్లలోకి వస్తుందని గట్టిగా చెప్పాడు.

Also Read: Kubera: అనగనగా కథ’ సాంగ్‌తో ‘కుబేర’పై అంచనాలు రెట్టింపు!

Manchu Vishnu: రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఈవెంట్స్‌తో ప్రేక్షకులను అలరించేందుకు ప్లాన్ చేసినట్టు వెల్లడించాడు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రం జూన్ 27న అభిమానులకు విజువల్ ట్రీట్ ఇవ్వనుంది. యాక్షన్, డ్రామా, ఎమోషన్స్‌తో పాటు స్టార్ పవర్ కూడా జోడించడంతో ‘కన్నప్ప’ అంచనాలను మించి రానుందని టాక్. మరి, ఈ భారీ ప్రాజెక్ట్ ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి!

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Mohan Babu: ఢిల్లీ హైకోర్టు మెట్లెక్కిన న‌టుడు మోహ‌న్‌బాబు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *