Cm revanth reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, పహల్గామ్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ, కాంగ్రెస్ పార్టీ తరఫున ర్యాలీలు నిర్వహించామని తెలిపారు. దేశ భద్రత విషయంలో రాజకీయాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు.
“యుద్ధ సమయంలో కేంద్రం తీసుకునే ఏ నిర్ణయానికైనా మేము పూర్తి మద్దతు ప్రకటించాం. మోడీకి అండగా నిలబడ్డాం” అని అన్నారు. పాకిస్తాన్కు తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని, సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని కాంగ్రెస్ కోరిందని చెప్పారు. పీవోకేను స్వాధీనం చేసుకోవాలని కూడా తమ అభిప్రాయం వెల్లడించారని తెలిపారు. అయితే నాలుగు రోజుల తర్వాత ట్రంప్ ప్రకటనతో యుద్ధం ఆగిపోయిందని, “మోడీ అఖిలపక్ష సమావేశాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదు?” అనే ప్రశ్నను రేవంత్ రెడ్డి వేశారు.