Crime News: “నూరు అబద్ధాలు ఆడి అయినా ఒక పెళ్లి చేయాలి” అనేది ఒక సామెత. ఇది సంబంధాలు కలుపుకోవడానికి చేసే ప్రయత్నాలలో భాగంగా పుట్టిన ఒక సామెత. అంటే, సంబంధాలు కలుపుకోవడానికి ఏదైనా ప్రయత్నం చేస్తే, అబద్ధాలు చెప్పినా పర్వాలేదు, పెళ్లి చేయాలనేది ప్రధాన ఉద్దేశం. పెళ్లి అనేది ఒక పెద్ద పని. అందుకని, ఏదైనా ప్రయత్నం చేసి, సంబంధాలు కలుపుకోవాలేనేది దాని భావన. అయితే ఇక్కడా ఓ ఇద్దరికి పెళ్లి కుదిర్చిన ఓ వ్యక్తి.. పెళ్లి చేసినందుకే దారుణ హత్యకు గురయ్యాడు.
Crime News: కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరులో ముస్తఫా (30)కు మరో యువతికి సులేమాన్ (50) అనే మధ్య వర్తి 8 నెలల క్రితం పెళ్లి కుదిర్చాడు. ఇద్దరూ కలిసి మంచి బతకాలను కోరుకున్నాడు. పిల్లా పాపలతో కలకాలం ఆ జంట నిలవాలని దీవించాడు. మనస్పర్థలు లేని జీవితం గడపాలని ఆ జంటకు ఓ పెద్దగా సూచనలు ఇచ్చాడు. ఆ జంట హాయిగా జీవితం గడుపుతుండగా, ఆ పెళ్లి పెద్ద తన దారిన తాన వెళ్లిపోయాడు.
Crime News: కానీ, ఆ జంటకు కొన్నాళ్లకే మనస్పర్థలు ముసురుకున్నాయి. పెళ్లి జరిగిన తర్వాత కొన్నాళ్ల నుంచే వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి. అవి ముదిరిపాకాన పడ్డాయి. ఇద్దరి మధ్యన తరచూ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఒకరంటే ఒకరికి పడకుండా పోయింది. దీంతో రెండు నెలల క్రితం ఇక వేగలేక ఆ యువతి తన పుట్టింటికి వెళ్లిపోయింది.
Crime News: ఈ విషయాన్ని ముస్తాఫా జీర్ణించుకోలేకపోయాడు. ఒకరికి ఒకరు అర్థం చేసుకోకుండా, ఒకరికి మించి మరొకరు గొడవలకు దిగిన వారు తమ తప్పును తెలుసుకోలేకపోయారు. దీనికి అసలు పెళ్లి కుదిర్చిన సులేమాన్‌ను కారకుడిగా ముస్తాఫా మూర్ఖంగా భావించాడు.
Crime News: తనతో తరచూ గొడవ పడే మహిళతో తనకు పెళ్లి ఎలా కుదిర్చావంటూ సులేమాన్ ఇంటికే వెళ్లిన ముస్తఫా అతనితో గొడవకు దిగాడు. ఈ సమయంలో ఇద్దరి మధ్యన వాగ్వాదం పెరిగింది. గొడవ పెద్దగా మారింది. ముస్తఫా ప్లాన్ ప్రకారం తనతో ఓ కత్తిని తెచ్చుకున్నాడు. ముస్తఫా తీవ్ర ఆగ్రహంతో సులేమాన్ మెడపై కత్తితో పొడవడంతో అక్కడికక్కడే కుప్పకూలి చనిపోయాడు. ఓ ఇద్దరికి పెళ్లి చేసిన పుణ్యం తెచ్చుకుందామనుకున్న సులేమాన్.. ఏకంగా ఆ పెళ్లి చేసుకున్న యువకుడి చేత ప్రాణాన్నే తీసుకోవాల్సి వచ్చింది.