Cold Water: త్రాగే నీటి విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. కొంతమందికి వేడి నీరు అలవాటు.. మరికొందరికి చల్లటి నీరు ఎక్కువగా తాగుతారు. కానీ మన శరీరానికి ఏది మంచిదో తెలుసుకోవాలి. నీరు హైడ్రేషన్‌తో పాటు మెరిసే చర్మానికి ఎంతో సహాయపడుతుంది. జీర్ణక్రియ మంచిగా జరిగేలా చేసి తలనొప్పిని కూడా అదుపులో ఉంచుతుంది. కానీ ఎలాంటి నీరు త్రాగాలి అనేది ముఖ్యం. చల్లటి నీరు జీర్ణక్రియకు మంచిది కాదు. ఇది శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
చల్లటి నీరు ఎందుకు మంచిది కాదు
చల్లటి నీరు లేదా ఐస్ క్రీములు, సోడాలు వంటి ఆహారాలు జీర్ణవ్యవస్థకు మంచివి కావు. ఇది శరీరంలోని వేడి కార్యకలాపాలను తగ్గిస్తుంది. దీనిని ఆయుర్వేదంలో జీర్ణ అగ్ని అంటారు. శరీరంలోని వేడి, జీర్ణక్రియ, జీవక్రియ, రోగనిరోధక శక్తి వంటి ముఖ్యమైన విధులకు ఉపయోగపడుతుంది. కానీ చల్లటి పదార్థాలు జీర్ణవ్యవస్థను బలహీనపరుస్తుంది. దీనివల్ల బరువు పెరుగడంతో పాటు అజీర్ణం, ఉబ్బసం కలుగుతుంది. చల్లటి నీరు కడుపులోని ఆమ్లాలు, పిత్తాన్ని పలుచన చేయడం ద్వారా అజీర్ణానికి కారణమవుతుంది. శరీరం కడుపులోని చల్లని ద్రవాన్ని వేడి చేయడానికి చాలా శక్తిని ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇది బద్ధకం, అలసట, అసౌకర్యానికి దారితీస్తుంది.
పరిష్కారం ఏమిటి?
జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయాలంటే రోజువారీ ఆహారంలో గోరువెచ్చని నీటిని చేర్చుకోవాలి. గోరువెచ్చని నీటితో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. భోజనానికి 30 నిమిషాల ముందు, తరువాత రోజంతా గోరువెచ్చని నీరు త్రాగాలి. జీర్ణక్రియ, జీవక్రియ, రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికి లెమన్ టీ వంటివి తాగవచ్చు.
గోరువెచ్చని నీరు ఉపయోగాలు
మలబద్ధకాన్ని నివారిస్తుంది:
నిపుణుల అభిప్రాయం ప్రకారం గోరువెచ్చని నీరు ప్రేగు కదలికలను నియంత్రిస్తుంది మరియు మలబద్ధకాన్ని నివారిస్తుంది.
మెరిసే చర్మానికి :
గోరువెచ్చని నీరు తాగినప్పుడు అది శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. శరీరం వ్యర్ధాలను విడుదల చేయడంలో బాగా పనిచేస్తుంది. ఇది మెరిసే చర్మానికి చాలా మంచిది. కాబట్టి చల్లని నీరు కంటే గోరు వెచ్చని నీరు తాగడం అలవాటు చేసుకోవాలి.