Phone Tapping Case

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. ప్రకటిత నేరస్థుడిగా ప్రభాకర్ రావు..?

Phone Tapping Case: హైదరాబాద్ ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మాజీ ఇన్టెలిజెన్స్ అధికారి ప్రభాకర్ రావును ప్రకటిత నేరస్థుడిగా (Proclaimed Offender) ప్రకటించేందుకు మార్గం సుగమమైంది.

జనవరిలోనే హైదరాబాద్ పోలీసులు నాంపల్లి కోర్టులో దీనికి సంబంధించి పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా ఈ పిటిషన్‌ను నాంపల్లి కోర్టు ఆమోదించింది. కోర్టు తీర్పుతో కేసులో కీలక ముందడుగు పడినట్టైంది.

అయితే, ప్రభాకర్ రావు తరఫు న్యాయవాదులు ఈ చర్యపై అభ్యంతరం తెలిపారు. కానీ కోర్టు, ప్రభాకర్ రావు నిర్దిష్ట గడువులోపు తమ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది.

ఇది కూడా చదవండి: AP Teachers: టీచర్ల బదిలీలకు ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

తాను కోర్టు ఇచ్చిన గడువులో హాజరుకాలేకపోతే, ప్రభాకర్‌రావును అధికారికంగా ప్రకటిత నేరస్థుడిగా గుర్తించే అవకాశముంది. ఈ పరిణామంతో ఫోన్ ట్యాపింగ్ కేసు మరింత వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయి.

ఇప్పటికే ఈ కేసులో పలువురు అధికారులు విచారణకు లోనవుతుండగా, ప్రభాకర్ రావు ఎక్కడ ఉన్నారన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పు కేసులో నూతన మలుపుని తెరిచింది.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Jagital: వివాహ వేడుక‌లో విషాదం.. ఫంక్ష‌న్‌కు వ‌చ్చి వెళ్తుండ‌గా ఇద్ద‌రి దుర్మ‌ర‌ణం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *