Jagital: ఓ పెళ్లి వేడుకలో హాజరై తిరిగి ఇంటికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదం బంధుమిత్రుల్లో విషాదం నిండుకున్నది. ఈ ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం ఆ వేడుకలో విషాదం నింపింది. తెలంగాణలోని జనగాం జిల్లాలో జరిగిన ఓ పెళ్లి వేడుకకు వెళ్లి తిరుగు ప్రయాణిస్తుండగా, జగిత్యాల జిల్లాలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నది. ఆదివారం ఉదయం ఐదే ఐదు నిమిషాల్లో తమ ఇండ్లకు చేరుకుంటామనుకునే లోపు రోడ్డు ప్రమాదం జరిగి ఆ రెండు కుటుంబాల్లో తీరని శోకం మిగిల్చింది.
Jagital: జనగాం జిల్లాలో జరిగిన వివాహ రిసెప్షన్‌కు జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన వారు హాజరై ఆదివారం ఉదయం తిరిగి కారులో వెళ్తున్నారు. జగిత్యాల జిల్లాలో కరీంనగర్ వెళ్లే ప్రధాన రహదారిపై ధరూరు గ్రామ కెనాల్ వద్ద జగిత్యాల డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సును అతివేగంతో వెళ్తున్న కారు ఢీకొన్నది. ఈ ఘటనలో జగిత్యాల హనుమాన్ వాడకు చెందిన కారు డ్రైవర్ సంకీర్త్, అతని పక్కనే ఉన్న మరో యువతి అక్కడికక్కడే మృతి చెందారు.
Jagital: కారులోనే వెనుక సీట్లో కూర్చున్న రాయమల్లు, ఆయన భార్యకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఇండ్ల సమీపంలోకి వచ్చిన రాగానే జరిగిన ఈ ఘటనను తలుచుకొని మృతులు కుటుంబ సభ్యులు దుఃఖిస్తుంటే స్థానికులు కంటనీరు పెట్టుకున్నారు.