AR Rahman

AR Rahman: రీమిక్స్ సరికాదన్న ఎ.ఆర్.రెహమాన్!

AR Rahman: ఇటీవల కాలంలో పాత పాటలను రీమిక్స్ చేయటం ఎక్కువై పోయింది. అయితే ఈ ధోరణి సరికాదంటున్నారు ఎ.ఆర్. రెహమాన్. ఇలా రీమిక్స్లు, రీ ఇమాజినేషన్ను సహించలేమని గట్టిగా చెప్పారు రెహ్మాన్. అలాగే మ్యూజిక్ లో AI ని ఉపయోగించటం వల్ల ఎదురయ్యే ప్రమాదాలపైనా ఆందోళనను వ్యక్తం చేస్తున్నారాయన. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఐదారు సంవత్సరాల క్రితం సినిమాల పాటలు కూడా రీమిక్స్ చేస్తుండటం సరికాదన్నారు. రీ ఇమాజిన్ చేసిన పాటను సోషల్ మీడియాలో ఉపయోగించుకోవచ్చు కానీ కమర్షియల్ గా ఉపయోగించరాదన్నారు.

AR Rahman: ఒరిజినల్ కంపోజర్ అనుమతి లేకుండా అలాంటి పని చేయకూడదంటూ తన పాటల్ని ఇటీవల కాలం అలా ఎక్కువగా ఉపయోగిస్తున్నారని ఆవేదనను వ్యక్తం చేశారు. ‘బొంబాయి’ సినిమాలోని ‘హమ్మ హమ్మ’ పాటను ‘ఓకె జాను’లో రీఇమాజిన్ చేశారన్నారు. ఇక AI ని కూడా దుర్వినియోగం చేస్తున్నారని, మ్యూజిక్ డైరెక్టర్ శైలిని అనుసరించినపుడు అతడికి చెల్లింపులు చేయకపోవడం అనైతికం అని అన్నారు. రెహమాన్ ప్రస్తుతం విక్కీ కౌశల్ ‘ఛావా’, మణిరత్నం ‘థగ్ లైఫ్’కు సంగీతం అందిస్తున్నారు. మరి రెహమాన్ అభిప్రాయాలను రీమిక్స్ రాయుళ్ళు ఎంత వరకూ పాజిటీవ్ గా తీసుకుంటారో చూద్దాం.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Niharika Konidela: కుర్రకారులో కాకరేపిన నిహారిక సాంగ్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *