Niharika Konidela: ‘ఒక మనసు’ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన నిహారిక కొణిదెల ఆ తర్వాత వెబ్ సీరిస్ తో పాటు మరికొన్ని సినిమాలలో నాయికగా నటించింది. చిరంజీవి ‘సైరా’లో అతిథి పాత్రను పోషించింది. అయితే ఇప్పుడు నిర్మాతగా బిజీగా ఉన్న నిహారిక తాజాగా తమిళ చిత్రం ‘మద్రాస్ కారన్’లో హీరోయిన్ గా నటించింది. వాలి మోహన్ దాస్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో మాధవన్, షాలిని జంటగా నటించిన ‘సఖి’ సినిమాలోని ‘అలలే అలలే చిట్టి చిట్టి అలలే’ అనే గీతాన్ని రీమిక్స్ చేశారు.
ఇది కూడా చుడండి : Baby John Trailer: అదిరిన ‘బేబీ జాన్’ ట్రైలర్!
Niharika Konidela: ఒరిజినల్ సాంగ్ కు ఎ.ఆర్. రెహమాన్ సంగీతం అందించగా, వి. నందగోపాలన్ ఈ పాటను రీమిక్స్ చేశాడు. ఇందులో హీరోతో కలిసి కొన్ని బోల్డ్ సీన్స్ లో నటించింది నిహారిక. తనకు ఉన్న ఇమేజ్ కు భిన్నంగా ఇలా నిహారిక గ్లామర్ డోస్ పెంచేయడంపై కొందరు ఆమెను విమర్శిస్తున్నారు. మరికొందరైతే… ఓ నటిగా పాత్రకు న్యాయం చేయడంలో తప్పేముందని నిహారికను వెనకేసుకు వస్తున్నారు. మరి తమిళ తంబీలు ఈ సినిమాకు ఎలాంటి విజయాన్ని కట్టబెడతారో చూడాలి.