Nara lokesh: అమెరికాలో లోకేష్ బిజీ.. ఈక్వెనెక్స్ డేటా సెంటర్‌ను సందర్శించిన మంత్రి

Nara lokesh: అమెరికాలో విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ బిజీ షెడ్యూల్ గడుపుతున్నారు. రోజుకు కంపెనీని సందర్శిస్తూ ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరుతున్నారు. ప్రపంచ ప్రఖ్యాత డేటా సేవల సంస్థ ‘ఈక్వెనెక్స్ డేటా సెంటర్’ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించారు. సంస్థ గ్లోబల్ ఎండీ కౌషిక్ జోషి, సీనియర్ స్ట్రాటజిక్ సేల్స్ ఇంజనీర్ రాబర్ట్ ఎలెన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా లోకేశ్‌కు వివరించారు.

తమ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 260కి పైగా ఇంటర్నేషనల్ బిజినెస్ ఎక్స్చేంజి డేటాసెంటర్ల నెట్ వర్క్ ఉందని వివరించారు.ప్రపంచంలోనే అత్యంత విస్తృతమైన, సురక్షితమైన డాటా సేవలను అందిస్తున్న సంస్థగా ఈక్వెనెక్స్‌కు పేరుందని వారు తెలిపారు.

రాయితీలు ఇస్తాం పెట్టుబడులు పెట్టండి : లోకేష్

ఇటీవల ఏపీ ప్రభుత్వం ప్రకటించిన ఎలక్ట్రానిక్స్ పాలసీలో పవర్ సబ్సిడీ, స్టాంప్ డ్యూటీ మినహాయింపు వంటి రాయితీలతో పాటు మెరుగైన ప్రోత్సాహకాలు ఉన్నాయనన్నారు మంత్రి లోకేష్. ఆంధ్రప్రదేశ్‌లో డేటా సెంటర్‌ ఏర్పాటుకు ఉన్న అనుకూలతలను వివరించారు.

భారత్‌లో పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన వాతావరణం నెలకొని ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని మంత్రి లోకేశ్ ఆహ్వానం పలికారు.ఈక్వెనెక్స్ ముందుకు వస్తే తాము అన్ని విధాలా సహాయ, సహకారాలు అందజేస్తామని హామీ ఇచ్చారు.

దాదాపు ప‌దిరోజుల పాటు ఆయ‌న అమెరికాలో ప‌ర్య‌టించ‌నున్నారు మంత్రి లోకేష్. బిజీ షెడ్యూల్‌తో పాటు భారీ ఆశ‌ల‌తో ఆయ‌న అగ్ర‌రాజ్యంలో అడుగు పెట్ట‌నున్నారు. భారీ ఎత్తున పెట్టుబ‌డులు తీసుకురావాల‌న్న‌ది నారా లోకేష్ ఆశ‌యం. ఇప్ప‌టికే రాష్ట్రంలో ప‌లు కంపెనీల‌ను తెచ్చేందుకు ఆయ‌న ప్ర‌య‌త్నిస్తున్నారు

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Baba Siddique: ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్యకేసులో కొత్త విషయాలు వెలుగులోకి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *