Hyderabad: మెట్రో మోత.. మే 17 నుంచి అమల్లో కొత్త ఛార్జీలు 

Hyderabad: హైదరాబాద్ నగరవాసులకు ఓ కీలక సమాచారం. మెట్రో రైలు యాజమాన్యం ఛార్జీలను అధికారికంగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ కొత్త టికెట్ రేట్లు 2025 మే 17వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి.

చార్జీల పెంపు వివరాలు:

కనిష్ట టికెట్ ధర: ప్రస్తుతం ఉన్న ₹10 నుండి ₹12కి పెంపు

గరిష్ట టికెట్ ధర: ₹60 నుండి ₹75కి పెరిగింది

ఈ ఛార్జీల పెంపుతో పాటు, మెట్రో సంస్థ ఆధునికీకరణ, మెరుగైన సేవలు, సౌకర్యాలు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రయాణికుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో, నిర్వహణ ఖర్చులను తీర్చేందుకు ఇది అవసరమని అధికారులు చెబుతున్నారు.ప్రజలు ముందుగానే తమ ప్రయాణ ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని, టికెట్ ధరల మార్పును దృష్టిలో ఉంచుకోవాలని మెట్రో అధికారులు సూచిస్తున్నారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Jyothi Surekha: సురేఖకు స్వర్ణం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *