India VS Pakisthan: కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఈ రోజు (మే 12న) కీలకమైన శాంతి చర్చలు జరగనున్నాయి. ఇరు దేశాల డీజీఎంవోల మధ్య ఈ చర్చలు జరగనున్నాయి. అయితే కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత పాక్ వైపు నుంచి ఉల్లంఘనలు జరిగాయి. సరిహద్దులో భారత్ వైపు వివిధ ప్రాంతాలపై పాక్ కాల్పులకు తెగబడింది. ఈ దశలో ప్రధాని మోదీ, భారత విదేశాంగ శాఖ, ఆర్మీ ఉన్నతాధికారుల మే 11న కీలకమైన ప్రకటనలు జారీ చేశారు. ఈ దశలో ఈ చర్చలపై అనుమానాలు కమ్ముకున్నాయి.
India VS Pakisthan: పాక్ కాల్పుల విరమణను ఉల్లంఘించడంతో ఆర్మీ కమాండర్లతో జనరల్ ఉపేంద్ర ద్వివేది కీలక భేటీ అయ్యారు. ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని ప్రధాని మోదీ ప్రకటించారు. పీవోకేను భారత్‌కు అప్పగించడం తప్ప వేరే మార్గం లేదని, ఇంతకు మించి మాట్లాడేది ఏమీ లేదని స్పష్టం చేశారు. ఇదే సమయంలో కాల్పుల విరమణపై ఆర్మీ కమాండర్లకే డీజీఎంవో పూర్తి అధికారాన్ని ఇచ్చారు.
India VS Pakisthan: ఈ దశలో భారత్, పాక్ చర్చలపై ఉత్కంఠ నెలకొన్నది. మే 12న సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు హాట్‌లైన్‌లో భారత్, పాక్ డీజీఎంవోలు చర్చలు జరపాలని నిర్ణయించారు. సరిహద్దుల్లో కాల్పుల విరమణ కొనసాగింపు, ఉద్రిక్తతల తగ్గింపు అంశాలపై చర్చలు జరగనున్నాయి.
India VS Pakisthan: కాల్పుల విరమణకే భారత్, పాక్ చర్చలు పరిమితం అవుతాయని భారత రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. సీజ్ ఫైర్ ప్రకటించిన తర్వాత మూడు గంటల్లోనే పాక్ వైపు నుంచి భారత్ వైపు కాల్పుల విరమణ జరిగింది. భారత్‌పై దాడి చేసే కుట్రలకు దిగింది. దీనిని భారత్ సైన్యం తిప్పికొట్టింది.