NTR: జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఏప్రిల్ 22న మొదలైన రెండో షెడ్యూల్‌ను నిన్నటితో ముగించిన ఆయన, కాస్త విరామం దొరకడంతో కుటుంబంతో సమ్మర్ ట్రిప్‌కు విదేశాలకు వెళ్లారు. ఈ ట్రిప్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఎన్టీఆర్ విదేశాలకు వెళ్లడంపై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు, ఎన్టీఆర్ హృతిక్ రోషన్‌తో కలిసి నటించిన ‘వార్ 2’ షూటింగ్ పూర్తి చేసారు. ఈ సినిమా ఆగస్టు 14న విడుదల కాబోతుందని ప్రకటించారు. కానీ, అదే రోజున రజనీకాంత్ ‘కూలీ’ రిలీజ్ కావడంతో, ‘వార్ 2’ వాయిదా పడుతుందనే టాక్ వినిపిస్తోంది. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ లేదా టీజర్ వస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. కానీ, ఇప్పటివరకు ఎలాంటి అప్‌డేట్ లేదు. ఈ సినిమా రిలీజ్‌పై స్పష్టత మే 20న వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

