Hari Hara Veera Mallu

Hari Hara Veera Mallu: ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ కంప్లీట్!

Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ పీరియడ్ యాక్షన్ డ్రామా ‘హరిహర వీరమల్లు: పార్ట్ 1 – స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్’ షూటింగ్ పూర్తయింది. 17వ శతాబ్దపు మొగల్ సామ్రాజ్య నేపథ్యంలో దర్శకుడు జ్యోతి కృష్ణ రూపొందిస్తున్న ఈ చిత్రం పవన్ అభిమానులకు విజువల్ ట్రీట్‌గా నిలవనుంది. రాజకీయ బాధ్యతలతో షూటింగ్ ఆలస్యమైనప్పటికీ, ఇటీవల రెండు రోజుల కీలక షెడ్యూల్‌ను పవన్ విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా, బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఎం.ఎం. కీరవాణి సంగీతం అదనపు ఆకర్షణ. ఏ.ఎం. రత్నం నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మే 30 లేదా జూన్ రెండో వారంలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. పవన్ యాక్షన్ అవతార్, భారీ సెట్స్, విజువల్ ఎఫెక్ట్స్‌తో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించనుంది. అభిమానులు ఈ ఎపిక్ డ్రామా కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  OG Makers: అభిమానులకి OG మేకర్స్ భరోసా!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *