OG Makers: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఓజి సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సుజిత్ రూపొందిస్తున్న ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. గతంలో రిలీజ్ డేట్‌పై అనుమానాలు తలెత్తినా, మేకర్స్ సెప్టెంబర్ 25న చిత్రం గ్రాండ్ రిలీజ్ అవుతుందని ప్రకటించారు. సోషల్ మీడియాలో మళ్లీ వాయిదా పడుతుందనే ఊహాగానాలు చక్కర్లు కొట్టిన నేపథ్యంలో, నిర్మాతలు మరోసారి స్పష్టతనిచ్చారు. “పుకార్లు నమ్మొద్దు.. ఓజి చెప్పిన తేదీనే వస్తాడు!” అంటూ సినిమా యూనిట్ కన్ఫర్మ్ చేసింది. ఈ ప్రకటనతో అభిమానులు సెప్టెంబర్ 25న ఓజి రాక కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించనుంది.
Rumours ni Nammakandi… #TheyCallHimOG arrives on Sept 25th!!🤟🏻 #OG pic.twitter.com/JPEyE3SSqe
— DVV Entertainment (@DVVMovies) July 2, 2025