Singham Again: ‘సింగమ్’ ఫ్రాంచైజ్ లో రాబోతున్న యాక్షన్ డ్రామా ‘సింగమ్ అగైన్’కు మరో హైలైట్ జత అయ్యింది. అజయ్ దేవ్ గన్ హీరోగా రోహిత్ శెట్టి తెరకెక్కిస్తున్న ఈ మూవీ నవంబర్ 1న జనం ముందుకు రాబోతోంది. ఇందులో రణ్ వీర్ సింగ్, టైగర్ ష్రాఫ్, అక్షయ్ కుమార్, కరీనా కపూర్, దీపికా పదుకొణే కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల వచ్చిన ట్రైలర్ వీరి అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. విశేషం ఏమంటే… ఇప్పుడు కొసమెరపులో ఈ చిత్రాలోకి సల్మాన్ ఖాన్ సైతం ఎంట్రీ ఇచ్చాడు. పద్నాలుగేళ్ళ క్రితం ‘దబంగ్’ కోసం చిల్ బుల్ పాండే అవతారం ఎత్తిన బాలీవుడ్ కండాల వీరుడు సల్మాన్… అదే గెటప్ లో ఈ సినిమాలో గెస్ట్ అప్పీయరెన్స్ ఇస్తున్నాడు. దీనికి సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ మంగళవారంలో ముంబైలో జరిగినట్టు చిత్ర బృందం తెలిపింది.
