Peddapalli: పెద్దపల్లిలో దారుణం చోటుచేసుకుంది. ఏడాదిన్నర పాపకు ఉరేసి తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. కారణం స్పష్టంగా తెలియకపోయినప్పటికి పసిపాపకు ఉరేసి తల్లి ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టిస్తుంది.పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రానికి చెందిన లోక వేణుగోపాల్ రెడ్డికి అయిదేళ్ల కిందట కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిరకు చెందిన సాహితితో వివాహం అయ్యింది. వారికి ఏడాదిన్న వయసున్న కూతురు రీతిన్య ఉంది. పెద్దపల్లి ఎల్ఐసి కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్న వేణుగోపాల్ నిన్న జగిత్యాలకు వెళ్ళారు.
రాత్రి ఇంటికి వచ్చేసరికి కూతురు రితిన్య, భార్య సాహితి విగతజీవులుగా పడి ఉన్నారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రాత్రి తల్లికూతురు మృతదేహాలను పెద్దపల్లి ఆసుపత్రిలోని మార్చురికి తరలించారు. సాహితి మానసిక స్థితి సరిగా లేక గత కొంతకాలంగా ఇబ్బందిపడుతుందని అందులో బాగంగానే బిడ్డకు ఊపిరి ఆడకుండా చేసి తాను ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు బావిస్తున్నారు. సంఘటన స్థలాన్ని సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్సై లక్ష్మణ్ రావు సందర్శించి కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.