Supreme Court

Supreme Court: పిల్లలు సోషల్ మీడియా వాడకాన్ని నిషేధించాలనే పిటిషన్ తిరస్కరించిన సుప్రీం కోర్టు

Supreme Court: 13 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకాన్ని చట్టబద్ధంగా నిషేధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారించడానికి సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్ ల ధర్మాసనం “ఇది విధానపరమైన విషయం. మీరు ప్రభుత్వాన్ని చట్టం చేయమని అకోరవచ్చు. ఇది మా పరిధికి మించినది.” అని చెప్పింది.

అయితే, కోర్టు ఇతర అధికారుల ముందు అప్పీల్ చేసుకునే స్వేచ్ఛను ఇచ్చింది. చట్ట ప్రకారం ఎనిమిది వారాల్లోగా అప్పీల్ దాఖలు చేసుకోవచ్చని ధర్మాసనం పేర్కొంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో పిల్లల యాక్సెస్‌ను నియంత్రించడానికి బయోమెట్రిక్ ధృవీకరణ వంటి వయస్సు ధృవీకరణ వ్యవస్థను ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం, ఇతర అధికారులను ఆదేశించాలని జెప్ ఫౌండేషన్ దాఖలు చేసిన పిటిషన్ కోరింది.

దీనితో పాటు, పిల్లల రక్షణ నియమాలను పాటించని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ కూడా ఉంది.

చట్టం తీసుకురావడానికి ప్రయత్నాలు..
మరోవైపు 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు సోషల్ మీడియాలో ఖాతా తెరవడానికి వారి తల్లిదండ్రుల సమ్మతిని తీసుకోవాలి. దీని కోసం, కేంద్ర ప్రభుత్వం డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ (DPDP), 2023 కింద నియమాల ముసాయిదాను సిద్ధం చేసింది. ఈ ముసాయిదా జనవరి 3న ప్రజలకు విడుదల చేశారు. Mygov.in ని సందర్శించడం ద్వారా ప్రజలు ఈ ముసాయిదాపై తమ అభిప్రాయాన్ని తెలియజేయవచ్చు. ఫిబ్రవరి 18 నుండి ప్రజల అభ్యంతరాలు మరియు సూచనలను పరిశీలిస్తున్నారు.

Also Read: Waqf Bill: వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు

Supreme Court: తల్లిదండ్రుల మొబైల్-ఈమెయిల్‌కు OTP వస్తుంది.ముసాయిదా విడుదలైన కొన్ని రోజుల తర్వాత, తల్లిదండ్రుల సమ్మతి కోసం ఒక నమూనా నిబంధన కూడా వెల్లడైంది. 18 ఏళ్లలోపు పిల్లల తల్లిదండ్రుల మొబైల్ ఫోన్లు – ఇమెయిల్‌లకు OTP పంపిస్తారని ఐటీ మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి.

డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ లో ఇప్పటికే ఉన్న పిల్లలు , తల్లిదండ్రుల డిజిటల్ ID కార్డుల ఆధారంగా ఈ OTP జనరేట్ అవుతుంది. దీని ద్వారా, పిల్లలు లేదా తల్లిదండ్రుల డేటా బహిరంగపరచబడదు. వయస్సు, నిర్ధారణకు తల్లిదండ్రుల నుండి అనుమతి కూడా తీసుకునే అవకాశం ఉంటుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Crime News: భార్యను హత్య చేసి జైలుకు.. విడుదలైన తర్వాత భర్తను అత్త ను చంపేశాడు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *